• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పింజ్ర టాడ్ యాక్టివిస్ట్ నటాషా తండ్రి మహవీర్ నర్వాల్ కోవిడ్‌తో మృతి..జైలులో ఉండగానే..!

|

మహిళా విద్యార్థుల హక్కుల కార్యకర్త నటాషా నర్వాల్ తండ్రి మహవీర్ నర్వాల్ కరోనావైరస్‌తో మృతి చెందారు. గతేడాది మే నెలలో ఢిల్లీ అల్లర్ల కేసులో నటాషాను పోలీసులు అరెస్టు చేశారు. ఇక అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉన్నారు. ఆదివారం సాయంత్రం తన తండ్రి మహవీర్ నర్వాల్ రోహతక్ హాస్పిటల్‌లో కోవిడ్‌కు చికిత్స పొందుతూ మరణించారు. గతేడాది మే నెల 23వ తేదీన తన సహచరులతో పాటు నటాషాను కూడా పోలీసులు అరెస్టు చేశారు. వారిపై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీ అల్లర్లలో వారి ప్రమేయం ఉన్నట్లు పేర్కొన్నారు. తన తండ్రి మరణించారన్న వార్త తెలుసుకున్న నటాషా కన్నటీ పర్యంతమయ్యారు. ఇక తన సోదరుడు ఆకాష్ కూడా కోవిడ్‌తో చికిత్స పొందుతున్నాడు.

  Piyush Chawla’s Father And Activist Natasha Narwal's Father Lost Life | Oneindia Telugu

  సీసీఎస్ హర్యానా అగ్రికల్చర్ యూనివర్శిటీలో మహవీర్ నర్వాల్ శాస్త్రవేత్తగా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. ఆ తర్వాత సీపీఐఎంలో సీనియర్ మెంబర్‌గా కొనసాగుతున్నారు. మే 3వ తేదీన తన శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడంతో ఆయన్ను హాస్పిటల్‌లో చేర్చారు. అయితే అప్పటికే మధుమేహం వ్యాధితో బాధపడుతుండటంతో ఆయన ఆక్సిజన్ లెవెల్స్ సాధారణ స్థాయికి చేరుకోలేకపోయాయి. దీంతో ఆదివారం ఉదయం వెంటిలేటర్‌పై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. కానీ వైద్యుల ప్రయత్నం ఫలించకపోవడంతో ఆదివారం సాయంత్రం మహవీర్ నర్వాల్ తుదిశ్వాస విడిచారు.

  Pinjra Tod Activist Natasha Narwals father and senior CPIM leader Mahavir narwal dies of covid

  గడిచిన ఏడాదిలో తన కూతురు నటాషా నర్వాల్ కేసు కోర్టులో విచారణకు వచ్చినప్పుడల్లా తప్పక హాజరయ్యేవారు మహవీర్ నర్వాల్. తన కుమార్తెపై అన్యాయంగా కేసులు బనాయించారని ఆమె అమాయకురాలని ఢిల్లీ అల్లర్లలో తన ప్రమేయం లేదని మహవీర్ నర్వాల్ చెప్పుకొచ్చారు. తప్పకుండా ఆమెకు న్యాయం జరుగుతుందని త్వరలోనే నిర్దోషిగా బయటకు తిరిగి వస్తుందని నర్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మహవీర్ నర్వాల్ మృతి పట్ల కమ్యూనిస్ట్ పార్టీ ప్రగాఢ సంతాపం తెలిపింది. మహవీర్ నర్వాల్ కుమార్తెను అన్యాయంగా మోడీ ప్రభుత్వం అరెస్టు చేసి తప్పుడు కేసులు పెట్టిందంటూ చివరి నిమిషంలో తండ్రిని కూడా కలవకుండా ప్రభుత్వం చేసిందని సీపీఐఎం చేసిన ట్వీట్‌లో మండిపడింది.లాల్ సలామ్ అంటూ ట్వీట్ చేసింది కమ్యూనిస్ట్ పార్టీ.

  నటాషా నర్వాల్ బెయిల్ పిటిషన్ ఆదివారం విచారణకు రావాల్సి ఉండగా అది ఎందుచేతనో సోమవారంకు వాయిదా పడిందని ఆవేదన వ్యక్తం చేశారు మహవీర్ నర్వాల్ స్నేహితుడు సీపీఐఎం నేత ఇందర్‌జిత్ సింగ్. ఇదిలా ఉంటే నటాషా నర్వాల్ తరపున లాయర్లు బెయిల్ పిటిషన్‌పై అర్జెంటుగా వాదనలు వినాలని హైకోర్టును అడిగేందుకు సిద్దమయ్యారు.

  English summary
  Pinjra Tod activist Natasha Narwal's father died due to covid in Rohtak.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X