వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పౌరసత్వ సవరణ చట్టం ఎఫెక్ట్, క్రిమినల్ మైండ్: సినిమా స్టైల్లో పక్కాప్లాన్ తో అల్లర్లు, సీసీకెమెరాల్లో

|
Google Oneindia TeluguNews

Recommended Video

CAA Protest: Was Mangaluru Incidents Pre Planned? CCTV Footage Reveal How Events Unfolded!

మంగళూరు/బెంగళూరు: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటకలోని మంగళూరులో పక్కాప్లాన్ ప్రకారం అల్లర్లు సృష్టించారని పోలీసులు ఆధారాలు సేకరించారు. పేరుపొందిన క్రిమినల్స్ ఎలా స్కెచ్ లు వేస్తారో అలాగే స్కెచ్ వేసి మంగళూరుల్లో సినిమా స్టైల్లో అల్లర్లకు కారం అయ్యారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అల్లర్లు జరగడానికి కొన్ని నిమిషాల ముందు ఆటోల్లో రాళ్లు, కర్రలు, పెట్రోల్ తీసుకువెళుతున్న దృశ్యాలు సీసీటీవీ పుటేజ్‌లో రికార్డు అయ్యాయని ఇండియా టుడే తన కథనంలో పేర్కొన్నది. మంగళూరులో జరిగిన అల్లర్లను అరికట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు. స్థానికులతో పాటు పోలీసులకు తీవ్రగాయాలైన విషయం తెలిసిందే.

నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!

 సంఘ వ్యతిరేక శక్తులు!

సంఘ వ్యతిరేక శక్తులు!

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్ సీలకు వ్యతిరేకంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో, నగరాల్లో, ప్రముఖ ప్రాంతాలతో పాటు పట్టాణాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటకలోని మంగళూరు నగరంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. మంగళూరులో జరిగిన హింసకు సంఘ వ్యతిరేక శక్తులు కారణం అయ్యారని మొదటి నుంచి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

నిప్పంటించిన దుండగులు!

నిప్పంటించిన దుండగులు!

మంగళూరు నగరంలోని అనేక సున్నితమైన ప్రాంతాల్లో కొందరు ఆందోళనకారులు వాహనాలు, ప్రజలు, ప్రభుత్వ ఆస్తులకు నిప్పంటించారు. ప్రజల, ప్రభుత్వ ఆస్తులకు ఎవరు నిప్పంటించారు అనే విషయంపై పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఇదే సమయంలో గూడ్స్ ఆటోలో రాళ్లు, పెట్రోల్ తీసుకు వచ్చిన కొందరు ప్రజలు, ప్రభుత్వ ఆస్తులు నాశం చేశారని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయిన విషయంపోలీసులు గుర్తించారు.

సినిమా స్ట్రైల్లో క్రిమినల్ మైండ్స్

సినిమా స్ట్రైల్లో క్రిమినల్ మైండ్స్

మంగళూరులో కొందరు ఆందోళనకారులు రెచ్చిపోవడంతో సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సినిమా ఫక్కీలో ముఖాలకు బట్టలు కట్టుకుని ప్రజలు, పోలీసుల మీద రాళ్లు రువ్వుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అదే సమయంలో సీసీ కెమెరాలు గుర్తించిన ఆందోళన కారులు తమ ముఖాలు పోలీసులు గుర్తు పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు మరికొన్ని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

పోలీసుల చేతికి సాక్షాలు

పోలీసుల చేతికి సాక్షాలు

మంగళూరులో ఓ వర్గానికి చెందిన యువకులు ఆందోళనల ముసుగులో ప్రజలు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్న సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మరో గుంపులోని యువకులు గూడ్స్ ఆటోల్లో రాళ్లు, కర్రలు, పెట్రోల్ తీసుకు వెలుతున్న సమయంలో పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

ప్రతిపక్షాలు ఏమంటాయి?

ప్రతిపక్షాలు ఏమంటాయి?

మంగళూరులో పోలీసుల మీద ఎలాంటి దాడులు జరగలేదని, ఆందోళన చేస్తున్న వాళ్లు ఎవ్వరూ ప్రజలు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చెయ్యలేదని ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కొందరు అంటున్నారు. అయితే ప్రస్తుతం తాము సేకరించిన సాక్షాలను కోర్టు ముందు పెడుతామని, తమ మీద ఆరోపణలు చేస్తున్న వారు ఏం సమాధానం చెబుతారో చూడాలని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద మంగళూరులో ఓ వర్గం వాళ్లు పక్కాప్లాన్ తో క్రిమినల్ మైండ్ ఉపయోగించి అల్లర్లు జరగడానికి కారణం అయ్యారని పోలీసులు పక్కా సాక్షాలు సేకరిస్తున్నారు.

English summary
Karnataka: It is well known that some mischiefs have already been planned by the Mangalore fire. Bringing stones in a bag at Goods Auto has been captured on CCTV. The police are conducting a thorough investigation into the matter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X