కలకలం: ప్లాస్టిక్ బియ్యం, గుడ్లే కాదు.. ప్లాస్టిక్ చక్కెరా వచ్చేసింది
కర్ణాటక రాష్ట్రంలో ప్లాస్టిక్ పంచదార(చక్కెర ) సంచలనంగా మారింది. పలు దుకాణాల్లో ఈ ప్లాస్టిక్ చక్కెర అమ్ముతున్నట్లు తెలుస్తోంది.
బెంగళూరు: ఇప్పటికే ప్లాస్టిక్ బియ్యం, కోడి గుడ్లు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న తరుణంలో కర్ణాటకలో ప్లాస్టిక్ పంచదార(చక్కెర ) సంచలనంగా మారింది. పలు దుకాణాల్లో ఈ ప్లాస్టిక్ చక్కెర అమ్ముతున్నట్లు తెలుస్తోంది.
బెంగళూరులోని హస్సన్ ప్రాంతానికి చెందిన శివకుమార్ అనే రైల్వే పోలీసు వారం రోజుల క్రితం ఓ దుకాణం నుంచి మూడు కిలోల చక్కెర కొనుగోలు చేశాడు. ఇంట్లో టీ పెడుతుండగా అందులో వేసిన చక్కెర కరిగిపోయి గిన్నెకి ప్లాస్టిక్ అంటుకోవడంతో వెంటనే మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు.

గడగ్ ప్రాంతంలో కూడా ప్లాస్టిక్ చక్కెర కలకలం రేపింది. ఇలా ప్లాస్టిక్ చక్కెరను తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. కాగా, సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు ప్లాస్టిక్ చక్కెరపై విచారణకు ఆదేశించారు.












Click it and Unblock the Notifications