వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీజేఐపై అభిశంసన పిటిషన్: తిరస్కరించిన సుప్రీం, తగ్గిన కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) దీపక్ మిశ్రాను అభిసించాలని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీలు నోటీసులివ్వగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆ తీర్మానంను తిరస్కరించారు. దీంతో ఉపరాష్ట్రపతి తీర్మానంను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ.. పలువురు కాంగ్రెస్ ఎంపీలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

కాగా, మంగళవారం ఉదయం విచారించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం.. ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. నిబంధనల మేరకు ఉపరాష్ట్రపతి నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడ్డ ధర్మాసనం.. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఉండబోదని స్పష్టం చేసింది.

Plea challenging rejection of impeachment motion against CJI dismissed as withdrawn

ఈ వ్యవహారంలో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ వినతిని కూడా సుప్రీం తోసిపుచ్చింది. విషయాన్ని పార్లమెంటు వేదికగా తేల్చుకోవాలని సూచించింది. అంతేగాక, మీకు మీరుగా పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీలను ఆదేశించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీలు వేసిన పిటిషన్ ను వారి తరపు లాయర్ కపిల్ సిబల్ వెనక్కి తీసుకున్నారు.

కాగా, నేరుగా రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించడంపై సిబల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదని చెప్పారు. చీఫ్ జస్టిస్ ఈ కేసును రాజ్యాంగ ధర్మసనానికి బదిలీ చేశారా? అని కపిల్ సిబల్ ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని కోరారు. అయితే, సిబల్ అభ్యర్థనను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. దీంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు కపిల్ సిబల్ ప్రకటించారు.

English summary
The Supreme Court has dismissed the petitions that challenged the decision to reject the impeachment motion against Chief Justice of India, Venkaiah Naidu. The petitions were dismissed as withdrawn.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X