వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను అహంకారి అనొద్దు ప్లీజ్!: బీహార్ సీఎం నితీష్ కుమార్

|
Google Oneindia TeluguNews

పాట్నా: దయచేసి తనను అహంకారి అని పిలవొద్దని బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుామర్ కోరారు. కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో తన నెలల నిశ్శబ్దం తనపై, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)పై ప్రజల అసంతృప్తికి దోహదపడిందనే మీడియా వాదనలను కొట్టిపారేశారు.

'దయచేసి, నన్ను అహంకారి అని పిలవకండి' అని నితీష్ కుమార్ చేతులు జోడించి చెప్పారు. తాను లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు ఎంత సాయం చేయాలో చేశానని, కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని నితీష్ కుమార్ మండిపడ్డారు. బీహార్ రాష్ట్రంలో నేరాలను కట్టడి చేశామని చెప్పారు. మద్య నిషేధాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు.

Please, Dont Call Me Arrogant: Nitish Kumar

'మీ అతిపెద్ద బలం కమ్యూనికేషన్, మీరు కమ్యూనికేట్ చేయడం మానేశారు. మీరు మీ అహంకారానికి బాధితులుగా మారారంటూ ప్రజలు అంటున్నారు. మీరు అహంకారంగా మారారని మీరు అంగీకరిస్తున్నారా? కరోనావైరస్ సంక్షోభం అంతా మీ నిశ్శబ్దాన్ని వివరిస్తుంది? మీరు ఒక్క మీడియా సమావేశంలో కూడా మాట్లాడలేదు' అని ఎన్డీటీవీ ప్రశ్నించగా ఈ మేరకు స్పందించారు.

మంగళవారం ముగిసిన ఎన్నికల్లో, నితీష్ కుమార్ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ) 243 మంది సభ్యుల అసెంబ్లీలో మెజారిటీని సాధించింది. కానీ, బీజేపీ 74 స్థానాల పెరగ్గా.. ముఖ్యమంత్రి జేడీయూ మాత్రం అంతకుముందు జరిగిన ఎన్నికలలో 71 సాధించి, ఇప్పుడు 43కి పడిపోయింది.

కాగా, ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఒకే అతిపెద్ద పార్టీగా అవతరించింది, ఎన్నికల్లో ఫలితాల్లో మూడోస్థానంలో జేడీయూ నిలవడంతో నితీష్ కుమార్‌ని రిటైర్ కావాలంటూ ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ హితవు పలికిన విషయం తెలిసిందే.

Recommended Video

#Biharelectionresults2020: 'This Is PM Narendra Modi's Win'| Chirag Paswan On Bihar Results

బీహార్ ముఖ్యమంత్రిని ఎన్డీఏనే నిర్ణయిస్తుందని నితీష్ కుమార్ ఇటీవలే స్పష్టం చేశారు. జేడీయూకు తక్కువ సీట్లు వచ్చినప్పటికీ నితీష్ కుమారే ఎన్డీఏ ముఖ్యమంత్రి అంటూ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీపాటు బీజేపీ నేతలు కూడా ఇప్పటికే ప్రకటించారు. కాగా, త్వరలో పశ్చిమబెంగాల్, తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది.

English summary
Nitish Kumar, set to be Chief Minister of Bihar for the seventh time but with a greatly diminished status in the ruling alliance after finishing at number 3, rejected the "arrogant" label in an interaction with the media after the state election results.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X