వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్బాబు.. గోవా రావొద్దు, వస్తే 14 రోజులు హోటళ్లలోనే బందీ, సీఎం సావంత్..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంతో యావత్ ప్రపంచం గజగజ వణికిపోతోంది. వైరస్ ప్రభావ స్థాయిని బట్టి... దేశంలో జోన్లను విభజించిన సంగతి తెలిసిందే. అయితే గోవా సీఎం ప్రమోద్ సావంత్ మాత్రం తమ రాష్ట్రానికి రావొద్దని కోరుతున్నారు. గోవా అంటే హాలీడే స్పాట్.. బీచ్‌‌తో పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. అయితే పర్యాటకుల వల్ల వైరస్ ప్రబలే అవకావం ఉన్నందున.. గోవా రావొద్దు.. బాబోయ్ అని సావంత్ కోరుతున్నారు.

హోం క్వారంటైన్ కంపల్సరీ

హోం క్వారంటైన్ కంపల్సరీ


విమానాలు, ప్రత్యేక రైళ్లలో వస్తోన్న గోవాకు చెందిన వారు కాకుంటే క్వారంటైన్ తప్పనిసరి అని సావంత్ పేర్కొన్నారు. గురువారం ఢిల్లీ నుంచి తిరువనంతపురం వెళ్తోన్న రైలు గోవాలోని మడగావ్ వద్ద శనివారం ఆగనుంది. అయితే ఆ రైలును స్టేషన్ వద్ద నిలుపొద్దని సావంత్ చెబుతున్నారు. అందులో ప్రయాణిస్తున్న 720 మంది.. మడగావ్‌కి చెందినవారు కాదని గుర్తించినట్టు తెలిపారు.

అనర్థమే..?

అనర్థమే..?


ఒకవేళ ప్రయాణికులు దిగితే జరిగే అనర్థం ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి తాము తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తామని.. హోం క్వారంటైన్‌లో ఉండాలని చెబుతామని పేర్కొన్నారు. అయితే వారు తమ మాట వింటారో లేదోననే ఆందోళన నెలకొంది. అందుకే రైలును నిలిపొద్దు అని కోరామని చెప్పారు. మడగావ్‌లో రైలు ఆపొద్దని విషయంపై తమకు సమాచారం లేదు అని రైల్వే అధికారులు తెలిపారు.

నెలన్నర నుంచి నో కేసు

నెలన్నర నుంచి నో కేసు


గోవాలో కరోనా వైరస్ ప్రభావం తగ్గింది. నెలన్నర నుంచి ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కానీ గురువారం 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారు గోవాకు చెందిన వారు కాదని, బయట రాష్ట్రాల నుంచి వచ్చారని అధికారులు చెప్పడంతో... సీఎం ప్రమోద్ సావంత్ మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ శుక్రవారం నుంచి గోవాకు వచ్చేవారు తమ వసతిని తామే సమకూర్చుకోవాలన్నారు.

Recommended Video

IAF Flypast : IAF Chopper Showers Flower Petals On Gandhi Hospital In Hyderabad | Oneindia Telugu
14 రోజులు హోటళ్లలోనే..

14 రోజులు హోటళ్లలోనే..


కాదు కూడదని వస్తే.. 14 రోజులపాటు హొటళ్లలో ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. బీచ్‌లోకి వెళ్లేందుకు వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోము అని స్పష్టంచేశారు. బీచ్‌లు మూసివేయబడి ఉంటాయని.. వారు ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి రాలేదని చెప్పారు. విమానాల ద్వారా వచ్చేవారిని కూడా ఎయిర్ పోర్టులలో చెక్ చేస్తామని స్పష్టంచేశారు.

English summary
Goa Chief Minister Pramod Sawant has suggested that the Railways cancel the halt at Madgaon station for special trains being operated by it as the state records new cases of coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X