వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎం కేర్స్‌ ఫండ్‌కు చైనా విరాళాలు.. అందుకే మోదీ నోరెత్తట్లేదన్న కాంగ్రెస్..

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా సరిహద్దు వివాదం, దేశంలో కొవిడ్-19 వ్యాప్తి అంశాలపై అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ తీవ్రస్థాయిలో తిట్టుకుంటున్నాయి. భారత సైనికులను దారుణంగా చంపేసిన చైనాకు మోదీ సరెండర్ అయిపోయారని కాంగ్రెస్ విమర్శించగా.. చైనా కమ్యూనిస్టు పార్టీతో కాంగ్రెస్ మిలాఖతైందంటూ బీజేపీ ఆరోపణలు చేసింది. ఈక్రమంలో చైనా కంపెనీల విరాళల వ్యవహారం వివాదాస్పదమైంది.

 లాక్‌ డౌన్ పొడగింపు: అధికారి ప్రకటన.. దేశంలో16వేల మంది మృతి.. గ్లోబల్‌గా 1కోటి దాటిన కేసులు..</a><a class=" title=" లాక్‌ డౌన్ పొడగింపు: అధికారి ప్రకటన.. దేశంలో16వేల మంది మృతి.. గ్లోబల్‌గా 1కోటి దాటిన కేసులు.." /> లాక్‌ డౌన్ పొడగింపు: అధికారి ప్రకటన.. దేశంలో16వేల మంది మృతి.. గ్లోబల్‌గా 1కోటి దాటిన కేసులు..

 పీఎం నిధికి చైనా విరాళాలు..

పీఎం నిధికి చైనా విరాళాలు..

చైనా సరిహద్దులో సైనికుల మరణాలు, ఆక్రమణలపై ప్రజలకు కేంద్రం అబద్దాలు చెబుతోందన్న కాంగ్రెస్ విమర్శలకు సమాధానంగా.. చైనా కమ్యూనిస్టు పార్టీతో గతంలో కాంగ్రెస్ పార్టీ కుదుర్చుకున్న ఒప్పందాలు, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు చైనా నుంచి నిధుల రాకపై బీజేపీ కొన్ని ఆధారాలను బయటపెట్టడం దుమారం రేపింది. అయితే, అదే చైనాకు చెందిన కంపెనీల నుంచి ప్రధాని నేతృత్వంలోని పీఎం కేర్స్ నిధి(కొవిడ్-19 ఉపశమనం కోసం ఏర్పాటు చేసింది)కి భారీ ఎత్తున విరాళాలు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

 ప్రమాదంలో జాతీయ భద్రత..

ప్రమాదంలో జాతీయ భద్రత..

మన జవాన్లు చనిపోయిన తర్వాత కూడా ఆయన చైనాను ఒక్కమాట అనకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పీఎం కేర్స్ కు నిధుల వ్యవహారాన్ని బటపెట్టారు. చైనాకు చెందిన ప్రముఖ టెక్‌ కంపెనీ హువావేతోపాటు పేటీఎంలో 38 శాతం వాటాలున్న మరో కంపెనీ, టిక్‌టాక్‌ లాంటి కంపెనీలు సైతం ఇటీవల పీఎం కేర్స్ నిధికి భారీగా విరాళాలిచ్చాయని తెలిపారు. ఇదే హువావే కంపెనీకి చైనా ఆర్మీతో సంబంధాలున్నాయని, అలాంటి పార్టీతో సత్సంబంధాలు ఉన్నాయని, అలాంటి సంస్థ నుంచి విరాళాలు తీసుకోవడం ద్వారా మోదీ దేశభద్రతను ప్రమాదంలోకి నెట్టేశారని సింఘ్వీ ఆరోపించారు.

అందుకే మోదీ మౌనం..

అందుకే మోదీ మౌనం..

గాల్వాన్ వ్యాలీలో భయానక హింస, ఆ ప్రాంతంలో సార్వభౌమాధికార ప్రకటన తర్వాత కూడా చైనాను మన ప్రధాని పల్లెత్తు మాట అనడంలేదని, ఆదివారం నాటి మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ ఆయన డ్రాగన్ దేశం పేరును మాటమాత్రానికైనా పలకలేదని చైనాకు మోదీ సరెండర్ అయిపోరనడానికి ఇంతకంటే నిదర్శనాలు అవసరం లేదని, చైనీస్ కంపెనీల నుంచి విరాళాలు తీసుకుంటున్నందుకే మోదీ మౌనంగా ఉంటున్నారేమోనంటూ సింఘ్వీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పీఎం కేర్స్ నిధిపై ముందు నుంచీ కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్న అనుమానాలు నిజమయ్యాయన్నారు. గత ఆరేళ్లలో మోదీ చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ తో 18 సార్లు భేటీ అయ్యారని గుర్తుచేశారు.

బీజేపీ రివర్స్ అటాక్..

బీజేపీ రివర్స్ అటాక్..

విపత్తు పరిస్థితుల్లో దాతల నుంచి విరాళాల సేకరణ, వాటిని ప్రజలకు అందజేయడం కోసం ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్(పీఎంఆర్ఎఫ్) ఉండేది. కొవిడ్-19 నేపథ్యంలో దానికి బదులుగా మోదీ సర్కార్ ‘పీఎం కేర్స్' నిధిని ఏర్పాటు చేయడంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. కాగా, పీఎం కేర్స్ కు చైనా కంపెనీల నుంచి విరాళాల విషయంలో కాంగ్రెస్ చేసిన ఆరోపణలన్ని బీజేపీ తిప్పికొట్టింది. ‘‘ఇదేమీ మీ(కాంగ్రెస్) రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు వస్తోన్న విరాళాల మాదిరికాదు. పీఎం కేర్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కాదన్న విషయాన్ని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి''అని కాషాయనేతల పేర్కొన్నారు. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ అడిగే ప్రతి ప్రశ్నకు బదులిస్తామని, 1962 నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామాలన్నింటిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.

చైనా హింసపై ప్రధాని మోదీ సంచలనం.. భారత్ సత్తా ప్రపంచానికి తెలుసు.. 2020 చెడ్డ ఏడాది కాబోదంటూ..చైనా హింసపై ప్రధాని మోదీ సంచలనం.. భారత్ సత్తా ప్రపంచానికి తెలుసు.. 2020 చెడ్డ ఏడాది కాబోదంటూ..

English summary
Hitting back at the Bharatiya Janata Party for raising the issue of funding to the Rajiv Gandhi Foundation, the Congress on Sunday alleged that Chinese firms were contributing to the PM Cares Fund and asked why it was accepting such donations when India and China have been engaged in a tense border standoff in Ladakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X