వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎం కేర్స్ ఫండ్‌కు 5 రోజుల్లో రూ. 3076 కోట్లు: వారి పేర్లు చెప్పాలంటూ చిదంబరం డిమాండ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడి కోసం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్‌కు మొదటి ఐదు రోజుల్లోనే రూ. 3076 కోట్లు భారత్ తోపాటు విదేశాల నుంచి విరాళాలుగా వచ్చాయని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. మార్చి 27-31 తేదీల మధ్య కాలంలో ఈ మొత్తం వచ్చినట్లు నమోదైంది. అయితే, ఈ నిధిని ప్రాథమికంగా 2.25 లక్షల కోట్లతో ఏర్పాటు చేయడం జరిగింది.

పీఎం కేర్స్ ఫండ్‌లోకి వచ్చిన మొత్తంలో 3,075.85 కోట్లు దేశీయంగా విరాళాులగా రాగా, విదేశాల నుంచి 39.67 లక్షలు వచ్చాయని వెల్లడించింది. 35 లక్షల వడ్డీ కూడా వచ్చిందని తెలిపింది. ఫోరెక్స్ కన్వర్షన్ పై సర్వీసు టాక్స్ రూపంలో 2049 రూపాయలు చెల్లించినట్లు పేర్కొంది. మార్చి 31 నాటకి క్లోజింగ్ 3076.62 కోట్లు ఉన్నాయని తెలిపింది. అయితే, విరాళాలు అందించినవారి పేర్లు మాత్రం వెల్లడించలేదు.

PM CARES Fund Received Rs 3,076 Cr Within First 5 Days of Launch; Why No Names: Chidambaram

ఈ నేపథ్యంలో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత పీ చిదంబరం విరాళాలు అందించినవారి పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదంటూ ప్రశ్నించారు. ఏ ఎన్జీవో అయినా లేదా ట్రస్ట్ అయినా కూడా తమకు విరాళాలు ఇచ్చినవారి పేర్లను వెల్లడిస్తాయి. మరీ పీఎం కేర్స్ ఫండ్ ఎందుకు పేర్లను వెల్లడించదని ఆయన నిలదీశారు. డోనర్లు ఎవరో తెలిసినప్పుడు పేర్లను వెల్లడించడానికి ఎందుకంత భయపడుతున్నారు? అని చిదంబరం ప్రశ్నించాడు.

కాగా, పీఎం కేర్స్ ఫండ్ ప్రజల నుంచి నిధులు సేకరించడం లేదని.. ప్రైవేటు వ్యక్తుల నుంచి నిధులు సేకరిస్తోందని అందుకే ఈ నిధిని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆడిట్ చేయలేదని పీఎంఓ స్పష్టం చేసింది. కరోనాతో పోరాడేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఈ అత్యవసర నిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

విపత్తు నిర్వహణ చట్టం, 2005 ప్రకారం చట్టబద్ధమైన నిధి ఉనికిలో ఉండటం, స్వచ్ఛంద విరాళాల కోసం వేరొకదాన్ని ఏర్పాటు చేయడాన్ని నిషేధించదని పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటును జూలై 11 న కేంద్రం సమర్థించింది. కాగా, ఓఎన్జీసీ, ఓఐఎల్ లాంటి ప్రభుత్వ సంస్థలతోపాటు ప్రభుత్వ శాఖలు సుమారు రూ. 2వేల కోట్లు పీఎం కేర్స్‌కు విరాళంగా ఇచ్చినట్లు జాతీయా మీడియా వార్తలను ప్రచురితం చేసిన విషయం తెలిసిందే.

పీఎం కేర్స్ ఫండ్‌కు ప్రధానమంత్రి ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా ఉండగా, రక్షణ మంత్రి, హోంమంత్రి, ఆర్థిక మంత్రి ఎక్స్ అఫిషియో ట్రస్టీలుగా ఉన్నారు. కాగా, మే 13న పీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ. 3100 కోట్లను ప్రభుత్వ ఆస్పత్రుల్లో 50వేల మేడ్ ఇన్ ఇండియా వెంటిలేటర్ల కోసం, వ్యాక్సిన్ అభివృద్ధి కోసం కేటాయించింది. బీహార్ రాస్ట్రంలో రెండు 500 బెడ్లతో ఆస్పత్రులను ఏర్పాటు చేసేందుకు కూడా డబ్బును కేటాయించింది.

English summary
PM CARES Fund Received Rs 3,076 Cr Within First 5 Days of Launch; Why No Names: Chidambaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X