వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు: ఆ నిధులు ఎన్‌డీఆర్ఎఫ్‌కు మళ్లించరాదు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పీఎం కేర్స్ కింద విరాళాల రూపంలో వచ్చిన డబ్బులను ఎన్డీఆర్‌ఎఫ్‌కు బదిలీ చేయరాదని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పీఎం కేర్స్‌‌కు విరాళాల రూపంలో వచ్చిన నిధులు ఒక కార్యం కోసం వచ్చినవని ఈ నిధులను ఇతర నిధులతో పోల్చరాదని ధర్మాసనం పేర్కొంది. పలు చారిటబుల్ ట్రస్టుల నుంచి ఈ నిధులు వచ్చాయని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఒకప్పుడు హార్స్ ఫార్మ్ నేడు కరోనావైరస్ వ్యాక్సిన్‌కు ఆలయం..ప్రపంచం దృష్టి ఈ భారత సంస్థ వైపే..!ఒకప్పుడు హార్స్ ఫార్మ్ నేడు కరోనావైరస్ వ్యాక్సిన్‌కు ఆలయం..ప్రపంచం దృష్టి ఈ భారత సంస్థ వైపే..!

ఇక ఎన్డీఆర్ఎఫ్‌కు ఏవైనా నిధులు లేదా గ్రాంట్లు ఇవ్వదలచుకుంటే అది మరో రూపంలో ఉండాలే తప్ప.. పీఎం కేర్స్ నిధులను బదిలీ చేయరాదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. పీఎం కేర్స్ ఫండ్ పై సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంటెరెస్ట్ లిటిగేషన్ అనే ఎన్జీఓ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాన్ని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన విచారణ ద్వారా తీర్పు వెలువరించింది.ఇక నుంచి పీఎం కేర్స్ ఫండ్‌కు వచ్చే నిధులన్నీ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఆర్‌ఎఫ్‌)కు బదిలీ చేయాలని కోరుతూ ఆదేశాలు ఇవ్వాల్సిందిగా పిటిషన్‌లో కోరింది. పీఎం కేర్స్ ఫండ్ జాతీయ విపత్తు నిర్వహణ చట్టంను ఉల్లంఘించేలా ఉందని పిటిషన్‌లో ఎన్జీఓ సంస్థ పేర్కొంది. పీఎం కేర్స్ ఫండ్ ఒక కార్యం కోసం ఏర్పాటు చేయడం జరిగిందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది.

PM CARES Funds cannot be transferred to NDRF rules Supreme Court

ఇదిలా ఉంటే ప్రైమ్‌మినిస్టర్స్ సిటిజెన్ అసిస్టెన్స్ మరియు రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచువేషన్స్ (PM CARES) ఫండ్‌ను ఈ ఏడాది మార్చి 28 ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా లాంటి మహమ్మారి దేశంపై దాడి చేసిన సమయంలో ఈ నిధులు వినియోగించేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధాని ఎక్స్ అఫీషియో ఛైర్మెన్‌గా వ్యవహరించనుండగా.. రక్షణశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి, ఆర్థికశాఖ మంత్రి ఎక్స్ అఫీషియో ట్రస్టీలుగా ఉంటారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు కూడా దీని చట్టబద్ధతను ప్రశ్నించాయి. ఇదివరకే ఉన్న పీఎంఎన్‌ఆర్ఎఫ్‌కు దీనికి తేడా ఏంటని ప్రశ్నించాయి.

ఇదిలా ఉంటే పీఎం కేర్స్‌కు స్వచ్ఛందంగా నిధులు వస్తాయని అదే ఎన్డీఆర్ఎఫ్‌కు ప్రభుత్వం బడ్జెట్ నుంచ కేటాయింపులు చేస్తుందని వివరణ ఇచ్చింది ప్రభుత్వం. ఎన్డీఆర్ఎఫ్ ఉన్నంత మాత్రానా మరొక విరాళాల సేకరణ నిధి తీసుకురాకూడదంటూ ఏమీ లేదని కేంద్రం స్పష్టం చేసింది.

English summary
Money collected under the PM CARES Fund for the coronavirus pandemic cannot be transferred to National Disaster Response Fund (NDRF), the Supreme Court said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X