వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీరం అగ్నిప్రమాదం: కార్మికుల మృతి పట్ల ప్రధాని విచారం -రేపు వ్యాక్సిన్ లబ్దిదారులతో మోదీ భేటీ

|
Google Oneindia TeluguNews

భారత్‌లో అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు, పుణె కేంద్రంగా పనిచేసే బయోటెక్నాలజీ, ఫార్మా దిగ్గజం సీరం ఇనిస్టిట్యూట్ లో గురువారం చోటుచేసుకున్న అగ్నప్రమాదంలో ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందారు. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో సీరం ప్రముఖ పాత్ర పోషిస్తున్న దరిమిలా ఈ ప్రమాదంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం..

Recommended Video

Covid-19 Vaccination Drive : ఇది ఎన్నో యుద్ధాలతో సమానం.. PM Modi స్పీచ్ హైలైట్స్..!

జగన్ పంతం - సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ -నిమ్మగడ్డకు అనుకూల తీర్పుపై సవాల్ -రాజస్థాన్‌ రిపీట్?జగన్ పంతం - సుప్రీంకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్ -నిమ్మగడ్డకు అనుకూల తీర్పుపై సవాల్ -రాజస్థాన్‌ రిపీట్?

పుణెలో సీరం ఇనిస్టిట్యూట్‌కు చెందిన నూతన ప్లాంట్‌లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు కార్మికులు చనిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీరం ప్రాంగణంలో చోటుచేసుకున్న దుర్ఘటనలో వ్యక్తుల మరణం తననెంతగానో బాధించిందని, ఈ కష్టసమయంలో మృతుల కుటుంబాలకు శాంతి కలగాలని కోరుతున్నానని, గాయడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానంటూ మోదీ గురువారం ట్వీట్ చేశారు..

 pm expresses sorrow over 5 deaths at Serum: modi to meet vaccine recipients in Varanasi

కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ అదనపు ఉత్పత్తి కోసం సీరం సంస్థ నిర్మిస్తున్న భనవంలో ఈ మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ కు చెందిన 10 ఫైరింజన్లు మంటలు ఆర్పిన తర్వాత మృతదేహాలను గుర్తించారు. కార్మికుల మృతి పట్ల సీరం సీఈవో అదార్ పూనావాలా సైతం విచారం వ్యక్తం చేశారు. నిర్మాణం పూర్తికావచ్చిన భవంతిలో వెల్డింగ్ పనుల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానిక అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే..

సీరంలో ఘోరం: ఐదుగురి ఆహుతి -పుణెలోని వ్యాక్సిన్ తయారీ కేంద్రం ప్రాంగణంలో భారీ అగ్నిప్రమాదంసీరంలో ఘోరం: ఐదుగురి ఆహుతి -పుణెలోని వ్యాక్సిన్ తయారీ కేంద్రం ప్రాంగణంలో భారీ అగ్నిప్రమాదం

దేశంలో కరోనా వ్యక్సినేషన్ డ్రైవ్ వేగవంతమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తన సొంత నియోజకవర్గం వారణాసిలోని వ్యాక్సిన్ లబ్దిదారులతో మాట్లాడనున్నారు. వీడియో కాన్ఫిరెన్స్​ ద్వారా జరుగనున్న భేటీలో.. వ్యాక్సిన్ తీసుకున్నవారి అనుభవాలను మోదీ అడిగితెలుసుకోనున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగమైన ప్రజలు.. వారి అనుభవాలను వినే అవకాశం దీని ద్వారా కలుగనుందని ప్రధానమంత్రి తెలిపారు. రేపటి సమావేశాన్ని అందరూ చూడాలని మోడీ కోరారు.

English summary
prime minister narendra modi mourns the death of five workers at Serum Institute fire accident in pune on thrusday. Anguished by the loss of lives due to an unfortunate fire, says modi. in an other news, PM Modi will interact with beneficiaries and vaccinators of the COVID-19 inoculation drive in Varanasi on Friday via video conferencing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X