• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బంజరు భూమిలో బంగారం: ఏపీ మహిళా రైతు రమకు ప్రధాని మోదీ ప్రశంసలు - PM Kisan రూ.19 వేల కోట్లు విడుదల

|

''నమస్తే వేణురమ జీ.. మీరెక్కల కష్టంతో బంజరు భూమిని సాగునేలగా మార్చి, సిరులు పండిస్తున్నారని విన్నాను. మీ అనుభవం ఈ దేశ రైతులకు ఎంతో అవసరం. సూపర్ ఫాస్ట్ పనితీరుతోనే మీలో ఆత్మవిశ్వాసం పెరిగినట్లు నాకనిపిస్తోంది. మీతోపాటు గిరిజన మహిళలనూ ప్రకృతి వ్యవసాయం వైపునకు నడిపిస్తుండటం గర్వకారణం. రైతుల్లో ఆత్వవిశ్వాసంపెంచేలా ఉంది మీ విజయగాథ.. '' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ.. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళా రైతు రమను ప్రశంసించారు.

viral video: ఆ గుండె ఆగింది -కరోనాతో 'లవ్ యూ జిందగీ’ యువతి మృతి -జీవితం అన్యాయం చేసిందన్న సోనూ సూద్viral video: ఆ గుండె ఆగింది -కరోనాతో 'లవ్ యూ జిందగీ’ యువతి మృతి -జీవితం అన్యాయం చేసిందన్న సోనూ సూద్

పీఎం కిసాన్ విడుదల వేళ..

పీఎం కిసాన్ విడుదల వేళ..

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) కింద ఎనిమిదో విడత ఆర్థిక సాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారంనాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. ఈ విడతలో రూ.19,000 కోట్లు 9.5 కోట్ల మంది లబ్ధిదారులైన రైతులకు నేరుగా వారి అకౌంట్లకు బదిలీ అవుతాయి. ఈ స్కీమ్ కింద ఒక రోజులో ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లిస్తుండటం ఇదే ప్రథమం. తొలిసారి ఈ పథకం ద్వారా పశ్చిమబెంగాల్ రైతులు కూడా లబ్ధి పొందనున్నారు. ఇవాళ్టి కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ.. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మేఘాలయ, జమ్మూకాశ్మీర్ కు చెందిన రైతులతో వర్చువల్ గా మాట్లాడారు. ఏపీకి చెందిన రమకు మోదీతో మాట్లాడే అవకాశం లభించింది.

భారత్ బయోటెక్ అనూహ్య అడుగు -కొవాగ్జిన్ ఫార్ములా పంచుకోడానికి రెడీ -జగన్ లేఖతో మోదీ సర్కార్ కదలికభారత్ బయోటెక్ అనూహ్య అడుగు -కొవాగ్జిన్ ఫార్ములా పంచుకోడానికి రెడీ -జగన్ లేఖతో మోదీ సర్కార్ కదలిక

సేంద్రియ సాగుపై సూచనలు..

సేంద్రియ సాగుపై సూచనలు..

రైతులను ప్రోత్సహించేందుకే కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. కిసాన్‌ సమ్మాన్‌ ద్వారా ఇప్పటివరకు రూ. 1.15 లక్షల కోట్లను అన్నదాతలకు అందించిందని గుర్తుచేశారు. సేంద్రీయ వ్యవసాయం దిశగా రైతులు అడుగు వేయాలని ఆకాంక్షించారు. ఇలా చేయడం వల్ల నేల సారవంతమవుతుందని, సేంద్రీయ వ్యవసాయం ద్వారా వచ్చే ఉత్పత్తులు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని అన్నారు. ఈ సందర్భంగా కొద్ది మంది లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన..

  Raghurama Krishnam Raju బర్త్ డే రోజు అరెస్ట్.. Ys Jagan గట్టి దెబ్బ కొట్టాడు!! || Oneindia Telugu
  నేను ఒంటరి ఎస్సీ మహిళను..

  నేను ఒంటరి ఎస్సీ మహిళను..

  ఏపీకి చెందిన వేణురమ అనే మహిళా రైతు బంజరు భూమిని సేంద్రీయ వ్యవసాయానికి అనువుగా మార్చుకొని పంటలు పండిస్తున్నవైనాన్ని ప్రధాని అడిగితెలుసుకున్నారు. ‘‘నేను ఒంటరి ఎస్సీ మహిళను. ప్రభుత్వం నాకు నాలుగు ఎకరాల అసైన్డ్ భూమి ఇచ్చింది. గత 10ఏళ్లుగా అది బంజరుభూమిగా ఉండింది. వర్షపాతం తక్కువ ఉన్న కారణంగా అందులో 2 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేశాను. ఒకేసారి మూడు పంటలు (నవధ్యాన్యాలు, వేరు శెనగ, కూరగాయలు) పండిచాను. రూ.20 వేల పెట్టుబడికి, రూ.1.07లక్ష లాభం వచ్చింది. కలిపిపెట్టుబడి 20 వేలైతే, 1.07లాభం వచ్చింది. ఆ తర్వాత తండాలోని ఆదివాసీ మహిళల్ని కూడా భాగస్వాములు చేసుకుని ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తున్నాం'' అని మహిళా రైతు రమ ప్రధాని మోదీకి వివరించారు.

  English summary
  Prime Minister Narendra Modi on Friday released the eighth installment of over Rs 20,000 crore to more than 9.5 crore farmer beneficiaries under the Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) scheme on Friday via video-conferencing. during the session, pm modi applauds woman farmer M Venurama of Andhra Pradesh.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X