వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫిబ్రవరి నుంచే రైతులకు కేంద్ర సాయం..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సాయం పథకం ఈ నెల నుంచే అమలు కానుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పేరిట తెరపైకి తీసుకొచ్చిన ఈ స్కీమ్ ను కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 5 ఎకరాల్లోపు వ్యవసాయ భూములున్న రైతులకు ప్రతి సంవత్సరం 6వేల రూపాయలు అందించనుంది కేంద్రం. ఈ పథకం కింద 12 కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరనుంది. పార్లమెంటులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. పీఎం కిసాన్ పథకం అమలుకు 20వేల కోట్ల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించింది కేంద్రం.

pm kisan scheme benefit from febraury

పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఇవ్వనున్న 6వేల రూపాయలను 3 దఫాలుగా చెల్లించనుంది కేంద్రం. అయితే 2018 డిసెంబర్ నుంచే ఈ పథకం వర్తించనుంది. ఆ మేరకు మొదటి దఫా కింద 2వేల రూపాయలు ( డిసెంబర్ విడత ) ఈ నెలలో రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ కానున్నాయనే టాక్ నడుస్తోంది. చిన్న, సన్నకారు రైతులతో పాటు భూముల వివరాలు కూడా కేంద్రం దగ్గర సిద్ధంగా ఉన్నాయని తెలిపారు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్.

English summary
The financial assistance scheme will be implemented by the central government for farmers across the country from this month. The center has taken the initiative to bring this scheme to the premise of Prime Minister Kisan Samman Yojana. The center is providing 6,000 rupees a year to farmers who had agricultural land in 5 acres.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X