వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతు పింఛను పథకం ప్రారంభించిన మోడీ: నెలకు రూ.3వేలు, 5కోట్ల రైతులకు మేలు

|
Google Oneindia TeluguNews

రాంచీ: ప్రధాని నరేంద్ర మోడీ దేశ రైతులకు మరో తీపి కబురును అందించారు. ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకాన్ని ఆయన రాంచీలో గురువారం ప్రారంభించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వచ్చే మూడేళ్లకు గానూ రూ. 10,774 కోట్లు కేటాయించింది.

60ఏళ్ల తర్వాత నెలకు రూ. 3వేలు

60ఏళ్ల తర్వాత నెలకు రూ. 3వేలు

చిన్న, సన్న కారు రైతులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. 18 నుంచి 40ఏళ్ల మధ్యలో ఉన్న వ్యవసాయదారులు ఈ పథకానికి అర్హులు. ఈ పథకంలో పేరు నమోదు చేసుకున్న వారికి 60ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ. 3వేల పింఛనును కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది.
ఇది వాలంటరీ స్కీమ్ కావడంతో నచ్చిన రైతులు ఈ పథకంలో చేరవచ్చు. ఈ పథకంలో చేరిన వారు నెలకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సమానమైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రైతుల పేరిట చెల్లిస్తుంది. ఈ రెండు మొత్తాలను 60ఏళ్లు నిండిన తర్వాత రైతులకు నెలకు రూ. 3వేలుగా ఇస్తారు.

నమోదు ఉచితం..

ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పథకంలో చేరేందుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అర్హత కలిగిన రైతులు కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్‌సీ) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సీఎస్‌సీ సెంటర్లు వసూలు చేసే రూ. 30 కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో రిజిస్ట్రేషన్ ఉచితమే.

రైతు చెల్లించే మొత్తానికి సమానంగా..

కాగా, రైతులు నెలకు రూ. 55 - రూ. 200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. రైతు వయస్సు ప్రాతిపదికన చెల్లించే మొత్తం మారుతుంది. రైతులు చెల్లించే మొత్తానికి సమాన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా పింఛను నిధికి చెల్లిస్తుంది. భార్యభర్తలిద్దరూ విడివిడిగా చెల్లించినట్లయితే విడి విడిగా పింఛను పొందే అవకాశం ఉంటుంది.

ముందే చనిపోతే..

ఒక వేళ ఈ పథకంలో చేరిన వ్యవసాయదారు రిటైర్మెంట్(60ఏళ్లు)కు ముందే మరణిస్తే చెల్లించిన మొత్తాన్ని వడ్డీతోపాటు తిరిగి చెల్లించడం జరుగుతుంది. నామినీకి ఆ మొత్తాన్ని అందజేశారు. కాగా, లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) పింఛను నిధిని నిర్వహిస్తోంది. గురువారం రాంచీలో పర్యటించిన మోడీ.. రైతు పింఛను పథకంతోపాటు మల్లీమోడల్ కార్గో టెర్మినల్‌ను ప్రారంభించారు. అంతేగాక, జార్ఖండ్ సచివాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువరదాస్ పాల్గొన్నారు.

English summary
Launching 'Pradhan Mantri Kisan Mandhan Yojana' from poll-bound Jharkhand, Prime Minister Narendra Modi said on Thursday that every farmer will get Rs 3,000 per month after attaining the age of 60.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X