వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలోనే అతిపెద్ద బీమా పథకం: ఆయుష్మాన్ భారత్‌పై రేపే ప్రధాని మోడీ ప్రకటన?

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆయుష్మాన్ భారత్‌పై రేపే ప్రధాని మోడీ ప్రకటన

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట పైనుంచి చేసే ప్రసంగంలో కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. 'జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం-ఆయుష్మాన్ భారత్'(ఏబీ-ఎన్‌హెచ్‌పీఎస్)ను ప్రకటించనున్నట్లు తెలిసింది. ఈ పథకాన్ని వచ్చే నెల(సెప్టెంబర్) చివరి వారం నుంచి అమలు చేయనున్నట్లు సమాచారం.

 50కోట్ల మందికి ప్రయోజనం

50కోట్ల మందికి ప్రయోజనం

దేశంలోని 10కోట్లకు పైగా పేద కుటుంబాలకు ఆరోగ్య భద్రత కింద సంవత్సరానికి రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. గ్రామాల్లో నివసించే 8.03కోట్ల కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నివసించే 2.33కోట్ల కుటుంబాలు దీని ద్వారా లబ్ధిని పొందనున్నాయి. ఈ పథకంతో దేశం మొత్తంలో 50కోట్ల మందికి ప్రయోజనాలు అందనున్నాయి.

22 రాష్ట్రాల్లో..

22 రాష్ట్రాల్లో..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోడీ చేయనున్న ప్రసంగంలో ఆయుష్మాన్ భారత్ పథకం ప్రకటించే అవకాశం ఉందని ఓ ప్రభుత్వాధికారి తెలిపారు. దేశంలోని 22 రాష్ట్రాల్లో త్వరలోనే ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా..

ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా..

మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, ఢిల్లీలో ఈ పథకం ప్రారంభంపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా, ఈ పథకంలో భాగస్వామి కావడానికి ఒడిశా అంగీకరించకపోవడం గమనార్హం. ఆయుష్మాన్ భారత్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు కేటాయించింది. ఈ పథకం అమల్లోకి వస్తే ప్రపంచంలోనే ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద ఆరోగ్య రక్షణ బీమా పథకంగా రికార్డుల్లోకెక్కనుంది.

 ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో..

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతోన్న సీజీహెచ్ఎస్ కన్నా ఈ పథకం లబ్ధిదారులు అధిక ప్రయోజనాలు అందుకోవచ్చు. ఆయుష్మాన్ భారత్ కోసం ప్రతి ఆస్పత్రిలో ‘ఆయుష్మాన్ మిత్ర' పేరిట ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తారు. అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లిన ఈ పథక లబ్ధిదారులు ముందుగా ఆస్పత్రిలోని ‘ఆయుష్మాన్' మిత్ర కౌంటర్‌ను సంప్రదించి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. కాగా, లబ్ధిదారులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ పథకం ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

English summary
Prime Minister Narendra Modi is likely to announce the launch of the Ayushman Bharat-National Health Protection Scheme (AB-NHPS) on a pilot basis in some states on the occasion of Independence Day, with the full-scale roll-out of his pet project expected in September end, sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X