వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీకి మెర్కెల్‌ ఆత్మీయ స్వాగతం: భారత్-జర్మనీ మరింత బలపడాలి(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌ను భారత్‌లో పర్యటించాలని ప్రధాని మోడీ కోరారు. జర్మనీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ, ఏంజెలా మెర్కెల్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ 'మేక్ ఇన్ ఇండియా' లో పెట్టుబడులకు అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

భవిష్యత్తులో భారత్ - జర్మనీ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలన్నారు. ప్రపంచంలోనే నైపుణ్యాభివృద్ధిలో జర్మనీ ఎంతో ముందుందన్నారు. జర్మనీ నుంచి భారత్‌ నేర్చుకోవాల్సింది చాలా ఉందని మోడీ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో జర్మనీతోపాటు భారత్ కూడా శాశ్వత సభ్యురాలిగా ఉంటే ప్రపంచానికే మేలని అన్నారు.

జర్మనీ నుంచి భారత మానవ వనరులకు కావాల్సిన సూచనలు, సహకారాలు అందితే భారత్ మేటి శక్తిగా ఎదుగుతుందన్నారు. ప్రపంచంలో మానవ మనుగడకు ఉగ్రవాదం పెనుభూతంలా మారిందని పేర్కొన్నారు. ఉగ్రవాద నిర్మూలనకు సమగ్ర ప్రణాళికతో రావాలని కోరారు. ఉగ్రవాదానికి మద్దతిచ్చేవారిని తాము ఏమాత్రం సహించబోమని చెప్పారు.

 జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో ప్రధాని మోడీ

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో ప్రధాని మోడీ

బెర్లిన్‌లోని ఫెడర్ ఛాన్సలరీ వద్ద గౌరవ వందనం స్వీకరిస్తున్న భారత ప్రధాని నరేంద్రమోడీ. పక్కనే జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌.

 జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో ప్రధాని మోడీ

జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో ప్రధాని మోడీ

జర్మనీ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ, ఏంజెలా మెర్కెల్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ 'మేక్ ఇన్ ఇండియా' లో పెట్టుబడులకు అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

జర్మనీ నుంచి భారత మానవ వనరులకు కావాల్సిన సూచనలు, సహకారాలు అందితే భారత్ మేటి శక్తిగా ఎదుగుతుందన్నారు. ప్రపంచంలో మానవ మనుగడకు ఉగ్రవాదం పెనుభూతంలా మారిందని పేర్కొన్నారు.

English summary
Prime Minister Narendra Modi on Tuesday was accorded a Guard of Honour during the ceremonial welcome given by German Chancellor Angela Merkel in the courtyard of the Federal Chancellery in Berlin.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X