• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కర్ణాటకలో 1,50 వేల మందికి రుణాలు, ప్రధాని నరేంద్ర మోడీ: సర్వేల్లో హంగ్, దేవేగౌడ జపం!

|

ఉడిపి/బెంగళూరు: ముద్రా యోజన పథకం ద్వారా కర్ణాటకలో రూ 1.50 లక్షల మందికి రుణాలు ఇచ్చామని, నిరుద్యోగులు, రైతులకు బ్యాంకుల తలుపులు మూసుకుపోయాయని, తాము అధికారంలో వచ్చిన వెంటనే బ్యాంకుల తలుపులు తీసేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉడిపిలో మంగళవారం జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇదే సమయంలో మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడను ఆకాశానికి ఎత్తేసిన మోడీ ఆయన జపం చేశారు.

శ్రీకృష్ణుడు, పరుశురాముడు

శ్రీకృష్ణుడు, పరుశురాముడు

ఉడిపిలోని శ్రీకృష్ణుడి మంఠంను ప్రధాని మోడీ సందర్శించారు. తరువాత ప్రధాని మోడీ పరుశురాముడి పవిత్ర గురించి మాట్లాడారు. ప్రధాని మోడీ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. కామన్ వెల్త్ లో పతకం సాధించిన గురురాజ్ ఉడిపి ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారని ప్రధాని మోడీ ప్రశంసించారు.

అమాయకుల హత్య

అమాయకుల హత్య

కర్ణాటకలో శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించాయని, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక పరువును దేశవ్యాప్తంగా తీసేసిందని ప్రధాని మోడీ ఆరోపించారు. 24 మంది హిందూ సంఘ, సంస్థల కార్యకర్తలు హత్యకు గురైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు.

అధికారులకు వేధింపులు

అధికారులకు వేధింపులు

కర్ణాటకలో లోకాయుక్త మీద దాడులు జరిగాయని, ఓ మహిళా పోలీసు అధికారి ప్రభుత్వానికి లేఖ రాయడంతో ఇక్కడ శాంతిభద్రతలు, అవినీతి పరిపాలన ఎలా ఉందో దేశవ్యాప్తంగా తెలిసిపోయిందని, అధికారుల మీద దౌర్జన్యాలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు.

మాజీ ప్రధానికి అవమానం

మాజీ ప్రధానికి అవమానం

దేశ మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడను కాంగ్రెస్ నాయకులు అవమానించారని నరేంద్ర మోడీ ఆరోపించారు. హెచ్ డి. దేవేగౌడ ఎప్పుడు ఢిల్లీ వచ్చి సమయం కావాలని అడిగినప్పుడు ప్రతిసారి ఆయనతో భేటీ అయ్యాయని, ఆయన అంటే తనకు చాల గౌరం అని, ఆయన కర్ణాటక మట్టి బిడ్డ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

దేశం మరిచిపోదు

దేశం మరిచిపోదు

ప్రధానిగా హెచ్ డి. దేవేగౌడ ప్రజల కోసం చేసిన సేవను దేశం ఎప్పటికి మరిచిపోదని, ఇంకా ఆయన ప్రజలకు సేవ చెయ్యాలని ప్రధాని మోడీ అన్నారు. హెచ్ డీ. దేవేగౌడ మా ఇంటికి వచ్చే గుమ్మం వరకు వెళ్లి కారు డోర్ తీస్తానని, ఆయన తిరిగి వెళ్లే సమయంలో కారు డోర్ తీసి వాహనంలో ఎక్కిస్తానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

ల్యాండ్ మాఫియా ప్రభుత్వం

ల్యాండ్ మాఫియా ప్రభుత్వం

కర్ణాటకలో ప్రస్తుతం ల్యాండ్ మాఫియా, స్యాండ్ మాఫియా ప్రభుత్వం ఉందని, ఇలాంటి ప్రభుత్వం మీకు కావాలా అని ప్రజలను ప్రశ్నించారు. స్వచ్చమైన, సుందరమైన కర్ణాటకను నిర్మించుకోవడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

సముద్రతీర ప్రాంతాలు

సముద్రతీర ప్రాంతాలు

కర్ణాటకలో అనుకూలమైన సుముద్రతీర ప్రాంతాలు ఉన్నాయని, సాగర మాల పథకం ద్వారా వాటిని అభివృద్ది చెయ్యడానికి చక్కటి అవకాశం ఉందని, బీజేపీ అధికారంలో వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని, మే 12వ తేదీన ప్రతి ఒక్క ఓటరు పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటు వేసే విధంగా ప్రతిఒక్క బీజేపీ కార్యకర్త చర్యలు తీసుకోవాని ప్రధాని నరేంద్ర మోడి పిలుపునిచ్చారు.

దేవేగౌడ జపం

దేవేగౌడ జపం

కర్ణాటకలో ఏ పార్టీ అధికారంలోకి రావడానికి సంపూర్ణ మెజారిటీ రాదని సర్వేలు చెబుతున్నాయి. జేడీఎస్ కింగ్ మేకర్ అవుతోందని సర్వేలు అంటున్నాయి. ఇలాంటి సందర్బంలో కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన మొదటి రోజు ప్రధాని నరేంద్ర మోడీ జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ జపం ఎక్కువ చెయ్యడం కొసమెరుపు.

English summary
Prime minister arrives to Udupi after finishing Chamarajnagar BJP rally. He will address mass rally in Udupi and may goto Krinsha Mutt. Narendra Modi addressing many rally's in Karnataka today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X