వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో మోడీ, అమిత్ షా భేటీ: ఎన్నికలపై మార్గనిర్దేశనం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న వివిధ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇప్పట్నుంచే కసరత్తులు ప్రారంభించింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల పార్టీ అధినేతలు, ముఖ్యమంత్రులు, పార్టీ శ్రేణులను అన్ని విధాలుగా సమయాత్తం చేస్తోంది.

ఈ క్రమంలో ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా, పార్టీ పాలిత రాష్ట్రాల 15 మంది ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో జరుగుతున్న ఈ భేటీకి 15 రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు.

PM Modi, Amit Shah chalk out the road ahead in BJP CMs meeting

ఈ సమావేశంలో ఎన్నికల కార్యాచరణ సహా ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు చేపట్టాల్సిన కార్యక్రమాలపై మోడీ, అమిత్‌షా ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

ప్రధానంగా ఆయూష్మాన్ భారత్ పతకాన్ని కీలక ప్రచారం ఉపయోగించుకోవాలని సూచించే అవకాశం ఉంది. సుపరిపాలన, పేదల అనుకూల పథకాలపై కూడా పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ఇరువురు సమీక్ష జరపనున్నారు. ఈ సమావేశంలోనే ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రులకు స్పష్టమైన మార్గనిర్దేశనం చేయనున్నట్లు సమాచారం.

English summary
BJP president Amit Shah today inaugurated a day-long meeting of the party's chief ministers in which it was decided to meet targets of the 'Swachh Bharat' scheme in a time-bound manner. BJP strategises for 2019 Lok Sabha polls. PM Modi and Amit Shah chalk out road-map for the big electoral battle in the national capital with all BJP ruled Chief Ministers in attendance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X