వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

21వ శతాబ్ధం బుద్ధుడికే అంకితం- ప్రధాని మోడీ, రాష్ట్రపతి కోవింద్ ధర్మ చక్ర దినోత్సవ సందేశాలు...

|
Google Oneindia TeluguNews

ప్రతీ ఏటా బుద్ధపూర్ణిమ సందర్భంగా నిర్వహించే ధర్మచక్ర దినోత్సవాన్ని ఈసారి ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి కోవింద్ తమ నివాసాల నుంచే సందేశాల రూపంలో నిర్వహించారు. ముందుగా మాట్లాడిన ప్రధాని మోడీ 21వ శతాబ్ధం బుద్ధుడికే అంకితమన్నారు.
బుద్ధుడి బోధనలు ఆలోచన, ఆచరణలో సాధారణ తత్వాన్ని ప్రవచిస్తాయన్నారు. సాటిజనం, పేదలు, మహిళలు, శాంతి, అహింసలను గౌరవించాలని బుద్ధుడు ప్రవచించారని మోడీ గుర్తు చేశారు. నమ్మకం, అవసరాన్ని బట్టి నడుచుకోవాలన్న బుద్ధుడి సందేశం అందరికీ ఆచరణీయమని మోడీ తెలిపారు.

21వ శతాబ్ధం మీద తనకు చాలా నమ్మకం ఉంది. ఇది మన యువతను చూశాకే కలిగిందని మోడీ పేర్కొన్నారు. ఈ నమ్మకమే బాధలను తొలగిస్తుందని, అంతిమంగా బుద్దుడి ఆలోచనల మీదే దేశం ముందుకు సాగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బౌద్దారామాలకు కనెక్టివిటీ కల్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందని ప్రధాని తెలిపారు. ఇందులో భాగంగా ముందుగా ఖుషీనగర్ తో ఇది ప్రారంభించాలని కేబినెట్ ఇప్పటికే నిర్ణయించినట్లు గుర్తుచేశారు.

pm modi and president kovind pays homage to budha on the occassion of budhapurnima

Recommended Video

PM Modi In Leh : China పై ప్రధాని Modi పంచముఖ వ్యూహం.. Ladakh ఎందుకు వెళ్లారంటే..! | Oneindia Telugu

బుద్ధుడు ప్రవచించిన అష్టాంగమార్గంతోనే జ్ఞానం సిద్ధిస్తుందని రాష్ట్రపతి కోవింద్ తన బోధనల్లో పేర్కొన్నారు. ఆధునిక సమాజంలో గాంధీ, అంబేద్కర్ వంటి వారు బుద్ధుడి ఆలోచనలతో ప్రభావితం అయి దేశానికి మార్గదర్శనం చేశారు. ఇవాళ కరోనా కారణంగా దేశాలు, వ్యవస్ధలు అతలాకుతలం అవుతున్నాయి. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు సమాజం ఎలా మెలగాలో బుద్ధుడి బోధనలు మనకు మార్దనిర్దేశనం చే్స్తాయి. కరోనా వైరస్ విపత్తు ముగిశాక వాతావారణ మార్పులపైనా మనం అదే స్దాయిలో దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి తెలిపారు.

English summary
president ramnadh kovind and prime minister narendra modi have addressed the nation on the occassion of dharma chakra day celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X