చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారత్‌లో ముగిసిన చైనా అధ్యక్షుడి పర్యటన: రెండ్రోజుల జిన్‌పింగ్ పర్యటన హైలెట్స్

|
Google Oneindia TeluguNews

చెన్నై: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకుని నేపాల్ బయలుదేరి వెళ్లారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీతో అనధికారిక సమావేశం నిర్వహించారు. ఇందుకు వేదికగా కోవలంలోని ఫిషర్‌మెన్ కోవ్ రిసార్ట్ వేదికగా నిలిచింది. శనివారం ఉదయం 10 గంటలకు వేదిక వద్దకు చేరుకున్న జిన్‌పింగ్‌కు ప్రధాని మోడీ స్వాగతం పలికారు. ఆ తర్వాత రెండు దేశాధినేతలు పలు అంశాలపై చర్చలు జరిపారు.

PM Modi and Xi Jinping Meet LIVE Updates in Chennai

శుక్రవారం రోజున మహాబలిపురంలో ప్రధాని నరేంద్ర మోడీ జిన్‌పింగ్‌కు ఘనస్వాగతం పలికారు. అంతకుముందు మహాబలిపురంకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ..తమిళ సంప్రదాయ వస్త్రధారణలో కనిపించి ఆకట్టుకున్నారు. ధోవతీ చొక్కా ధరించిన ప్రధాని కొత్త గెటప్‌లో అట్రాక్ట్ చేశారు. జిన్‌పింగ్‌కు మహాబలిపురం ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించారు. పల్లవ రాజులు సముద్రతీరంలో నిర్మించిన షోర్ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందని చెప్పారు.

PM Modi and Xi Jinping Meet LIVE Updates in Chennai

యూనెస్కో మహాబలిపురం ఆలయంను వారసత్వ సంపదగా గుర్తించిందని మోడీ తెలిపారు. ఇరు దేశాధినేతలు ఆలయ ప్రాంగణంలో కలియతిరిగారు. అనంతరం ఇద్దరు నేతలు పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత తమిళ రుచులతో కూడిన భోజనం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు విందులో ఏర్పాటు చేశారు. ఇక శనివారం అక్టోబర్ 12న ఇరు దేశాధినేతలు అనధికారిక ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

PM Modi and Xi Jinping Meet LIVE Updates in Chennai

మహాబలిపురం వేదికగా జరగనున్న మోడీ జిన్‌పింగ్‌ల సమావేశానికి సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ చూడగలరు

Newest First Oldest First
1:54 PM, 12 Oct

రెండ్రోజుల భారత పర్యటనను ముగించుకున్న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రత్యేక విమానంలో తిరుగుపయనమయ్యారు.
1:16 PM, 12 Oct

భారత్‌లో ముగిసిన చైనా అధ్యక్షుడి పర్యటన: జిన్‌పింగ్‌కు వీడ్కోలు పలికిన ప్రధాని మోడీ
12:36 PM, 12 Oct

ఓ వైపు జిన్‌పింగ్ ఫోటో మరోవైపు మోడీ ఫోటో కాంచీపురం సిల్క్ బట్టను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు బహూకరించిన ప్రధాని నరేంద్ర మోడీ
12:32 PM, 12 Oct

తంజావూరు పెయింటింగ్‌ను జిన్‌పింగ్‌కు బహూకరించిన ప్రధాని నరేంద్ర మోడీ
12:31 PM, 12 Oct

కాంచీపురం సిల్క్ చీరను జిన్‌పింగ్ భార్యకు కానుకగా అందజేసిన ప్రధాని నరేంద్ర మోడీ
12:28 PM, 12 Oct

మగ్గంపై నేసిన చీరలను జిన్‌పింగ్‌కు చూపించిన ప్రధాని మోడీ
12:27 PM, 12 Oct

చైనా అధ్యక్షుడికి మగ్గంతో బట్టలు నేసే విధానంను వివరించిన ప్రధాని మోడీ
12:08 PM, 12 Oct

భారత్‌ ఇచ్చిన ఆతిథ్యం మరువలేనిది: జిన్ పింగ్
12:07 PM, 12 Oct

ద్వైపాక్షిక సంబంధాలపై చాలా చక్కటి వాతావరణంలో చర్చలు జరిగాయి: జిన్ పింగ్
12:07 PM, 12 Oct

చెన్నైకి రావడం ఎంతో సంతోషం ఆనందం కలిగించింది: జిన్‌పింగ్
12:03 PM, 12 Oct

తమిళనాడు చైనాల మధ్య సాంస్కృతిక మరియు వాణిజ్య బంధాలు 2వేల సంవత్సరాలకుపైగా కొనసాగాయి
11:57 AM, 12 Oct

విబేధాలు వివాదాలుగా మారకూడదన్న ప్రధాని మోడీ
11:56 AM, 12 Oct

వుహాన్ సమావేశం భారత్ చైనా బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బీజం వేసింది: మోడీ
11:56 AM, 12 Oct

అనధికారిక సమావేశాలు భవిష్యత్తులో కూడా నిర్వహిస్తాం: జిన్‌పింగ్
11:55 AM, 12 Oct

భారత్-చైనాలు ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్నాయి: ప్రధాని మోడీ
11:54 AM, 12 Oct

భారత్ చైనాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన చర్చలు
10:40 AM, 12 Oct

ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య ప్రారంభమైన చర్చలు
10:20 AM, 12 Oct

కోవలంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఘనస్వాగతం పలికిన ప్రధాని మోడీ
9:58 AM, 12 Oct

ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్ నుంచి కోవలంకు బయలుదేరిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. కాసేపట్లో ప్రధాని మోడీతో సమావేశం కానున్న జిన్‌పింగ్
8:18 AM, 12 Oct

మరికాసేపట్లో అనధికారిక చర్చలు ప్రారంభించనున్న ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
11:10 PM, 11 Oct

మహాబలిపునం నుంచి బయలుదేరిన తర్వాత మోడీ, జిన్‌పింగ్ కలిసి భోజనం చేశారు. దక్షిణభారత వంటకాలు ముఖ్యంగా తమిళనాడు వంటకమైన సాంబారును ప్రత్యేకంగా వడ్డించారు.
10:11 PM, 11 Oct

సాంస్కృతిక కార్యక్రమాలు ముగిసిన అనంతరం మహాబలిపురం నుంచి బయలుదేరుతున్న ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.
8:17 PM, 11 Oct

శాంతిమంత్రంతో సాంస్కృతిక కార్యక్రమాలు ముగిశాయి.
8:15 PM, 11 Oct

కళాక్షేత్ర ఫౌండేషన్ ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థుల బృందం చేసిన ఆరు ప్రదర్శనలు నరేంద్ర మోడీ, జిన్‌పింగ్‌లను కట్టిపడేశాయి.
7:30 PM, 11 Oct

జిన్‌పింగ్‌కు భారత్ స్వాగతం పలుకుతోందంటూ పీఎంవో ట్వీట్.
7:29 PM, 11 Oct

మోడీ, జిన్‌పింగ్ పర్యటన సందర్భంగా ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు.
7:13 PM, 11 Oct

మహాబలిపురంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తున్న ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.
6:58 PM, 11 Oct

మహాబలిపురం ఆలయంలో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.
6:45 PM, 11 Oct

శుక్రవారం రాత్రి దీపాల వెలుగులో మహాబలిపురం ఆలయం. ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆలయాన్ని సందర్శించిన వేళ ప్రత్యేకంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు.
6:23 PM, 11 Oct

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కలిశారు.
READ MORE

English summary
Check out the live coverage of PM Narendra Modi and Chinese President Xi Jinping meet in Mahabalipuram, Chennai for the second informal summit from October 11-12.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X