వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొన్ని గంట‌ల్లో..చారిత్రాత్మ‌క ప‌థ‌కానికి శ్రీకారం! రైతు ఖాతాల్లో నిధులు జ‌మ‌

|
Google Oneindia TeluguNews

గోర‌ఖ్‌పూర్ః మ‌రి కొన్ని గంట‌లు! కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తోన్న ప‌థ‌కం ఆరంభం కానుంది. వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి తీసుకుని రాగ‌ల‌ద‌ని భావిస్తోన్న కీల‌క ప‌థ‌కం అది. అదే- కిసాన్ స‌మ్మాన్ నిధి. ఆర్థిక సంవ‌త్స‌రంతో సంబంధం లేకుండా.. కొన్ని రోజుల వ్యవ‌ధిలోనే కిసాన్ సమ్మాన్ నిధి ప‌థ‌కాన్ని అమ‌లులోకి తెస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్ స‌మావేశాల్లో ప్ర‌క‌టించింది. దీనికి అవ‌స‌ర‌మైన బ‌డ్జెట్‌ను కేటాయించింది.దీనికి అనుగుణంగా ఈ ప‌థ‌కం కింద అర్హులైన రైతుల‌కు చెల్లించ‌డానికి 75 వేల కోట్ల రూపాయ‌ల‌ను కేంద్ర ఆర్థిక‌శాఖ మంజూరు చేసింది.

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రధానమంత్రి న‌రేంద్ర‌మోడీ ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. గోర‌ఖ్‌పూర్‌లో ఆదివారం ఉద‌యం 11 గంట‌ల‌కు నిర్వ‌హించ‌బోయే బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని ఈ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించ‌బోతున్నారు. ఈ ప‌థ‌కం కింద దేశవ్యాప్తంగా అయిదు ఎకరాలలోపు వ్య‌వ‌సాయ భూమి ఉన్న రైతులకు కేంద్ర‌ప్ర‌భుత్వం పెట్టుబ‌డి సాయంగా ఏటా 6000 రూపాయ‌ల‌ను చెల్లిస్తుంది. ఒక ఆర్థిక సంవ‌త్సరంలోమూడు విడతలుగా ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. ఒక్కో త్రైమాసికంలో 2000 రూపాయ‌ల చొప్పున మొత్తాన్ని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేస్తారు.

PM Modi announce Rs. 75,000-Crore Farmer Scheme From UPs Gorakhpur Today

12 కోట్ల మంది రైతులు..తొలి విడ‌త కోటి మంది

దేశ‌వ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులు ఈ ప‌థ‌కం కిందికి వ‌స్తార‌ని కేంద్రం అంచ‌నా వేసింది. ఈ ప‌థ‌కం ప్రారంభ‌మైన వెంట‌నే.. కోటి మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 2000 రూపాయ‌లు జ‌మ అవుతాయి. దీనికి సంబంధించిన విధి విధానాల‌న్నీ పూర్తి చేసింది కేంద్రం. అర్హులైన రైతుల ఎంపిక కూడా పూర్త‌యింది. దీనికోసం కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా ఓ పోర్ట‌ల్ ను కూడా ప్రారంభించింది. అర్హులైన రైతుల వివ‌రాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఇదివ‌ర‌కే ఈ పోర్ట‌ల్ ద్వారా కేంద్రానికి అంద‌జేశాయి. వాటి ఆధారంగా కేంద్రం నిధుల‌ను బ‌దిలీ చేయ‌నుంది. తొలిద‌శ‌లో కోటి మంది, మ‌లి ద‌శ‌లో మిగిలిన రైతుల ఖాతాల్లో మ‌రో వారం రోజుల్లోగా ఈ మొత్తం జ‌మ అవుతుంది. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 1వ తేదీ నుంచి ఈ ప‌థ‌కం అమ‌ల్లోకి తెచ్చిన‌ట్టుగా కేంద్రం చూపిస్తోంది. అందుకే 2018-19 ఆర్థిక సంవ‌త్స‌రం మూడో త్రైమాసికానికి సంబంధించిన 2000 రూపాయ‌ల బ‌కాయిల‌ను రైతుల బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేయ‌బోతున్నట్లు చెబుతోంది.

English summary
NEW DELHI: Prime Minister Narendra Modi will launch the Rs. 75,000-crore Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) scheme in Uttar Pradesh's Gorakhpur today by transferring the first instalment of Rs. 2,000 each to over one crore farmers, news agency PTI quoted a senior agriculture ministry official as saying. Another one crore farmers are expected to be covered in the next two to three days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X