వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీతాల పెంపు: అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ప్రధాని మోడీ తీపి కబురు

|
Google Oneindia TeluguNews

Recommended Video

అంగన్వాడీ, ఆశా వర్కర్లకు జీతాల పెంపు...!

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ, ఆశా వర్కర్లకు ప్రధాని నరేంద్ర మోడీ తీపి కబురు అందించారు. దేశంలోని లక్షలాది మంది అంగన్వాడీ, ఆశా వర్కర్లతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

అంగన్వాడీ, ఆశా కార్యకర్తల సమస్యలు తెలుసుకోవడంతోపాటు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలను మోడీ వారికి వివరించారు. సామాజిక సాధికారత కోసం అంగన్వాడీ, ఆశా వర్కర్లు చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు.

PM Modi announces hike in remuneration of ASHA, Anganwadi workers

ఈ సందర్భంగా వారికి ఇచ్చే గౌరవవేతనం పెంచుతున్నట్లు మోడీ ప్రకటించారు. ప్రస్తుతం రూ.3వేలు అందుకుంటున్నవారి గౌరవ వేతనాన్ని రూ.4వేలకు, అలాగే ప్రస్తుతం రూ. 2,200లు అందుకుంటున్నవారి వేతనాలను రూ.3,500లకు పెంచుతున్నట్లు తెలిపారు.

ఇక అంగన్వాడీ సహాయకులకు రూ. 1500 నుంచి రూ. 2,250లు పెంచుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకునే వారికి ప్రోత్సాహకంగా వారి పనితీరును బట్టి రూ.250 నుంచి రూ. 500ల వరకు ఇవ్వాలని నిర్ణయించారు. జీతాలు పెంచినందుకు అంగన్వాడీ, ఆశా వర్కర్లు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.

English summary
Prime Minister Narendra Narendra Modi on Tuesday announced an increase in remuneration of those involved with the government’s Accredited Social Health Activist (ASHA) scheme and anganwadi scheme. The PM said the anganwadi workers will get the hiked remuneration from next month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X