వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా వేళ అమెరికాతో భారీ ఒప్పందం -‘ఇండియా-యూఎస్ క్లైమెట్, క్లీన్ ఎనర్జీ ఎజెండా’ ప్రకటించిన ప్రధాని మోదీ

|
Google Oneindia TeluguNews

మానవాళి మొత్తం కరోనా మహమ్మారితో పోరాడుతోన్న ప్రస్తుత తరుణం.. వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రమాదం ఇంకా తొలగిపోలేదని గుర్తుచేస్తున్నదని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వాతావరణంలో విపరీత మార్పులను అడ్డుకోవాలన్నా, కర్బన ఉద్గారాలు తగ్గేలా క్లీన్ ఎనర్జీని పెంపొందించాలన్నా అందుకు పటిష్ట చర్యలు, దీర్ఘకాలిక ప్రణాలికలు అవసరమని వక్కాణించారు. భూతాపం పెంచుతున్న వాతావరణ మార్పులను అరికట్టే దిశగా అమెరికా నేతృత్వంలో జరుగుతోన్న క్లైమెట్ సమ్మిట్ ను ఉద్దేశించి గురువారం ఆయన కీలక ప్రసంగం చేశారు. అంతేకాదు,

Recommended Video

PM Modi Announces India-US 2030 Climate Partnership || Oneindia Telugu

Covid: భారత్‌కు మరో దెబ్బ -విమాన సర్వీసులపై యూఏఈ నిషేధం -భారతీయు ప్రయాణికులపైనా ఆంక్షలుCovid: భారత్‌కు మరో దెబ్బ -విమాన సర్వీసులపై యూఏఈ నిషేధం -భారతీయు ప్రయాణికులపైనా ఆంక్షలు

పర్యావరణ హితం కోసం అమెరికా, భారత్‌ 'ఇండియా-యూఎస్ క్లైమెట్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 పార్టనర్‌షిప్' పేరిట నూతన భాగస్వామ్యాన్ని నెలకొల్పుతున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించారు. వర్చువల్ విధానంలో జరుగుతున్న ఈ సమావేశంలో వివిధ దేశాలు పాల్గొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సమావేశాలను ప్రారంభించారు. భారత్ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. సమావేశం ఏర్పాటుకు చొరవ తీసుకున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు.

PM Modi announces India-Us Climate and Clean Energy partnership along with joe biden

క్లైమెట్ చేంజ్ ను అడ్డుకోడానికి పటిష్ట చర్యలు అవసరమని, జీవన విధానంలో చేయాల్సిన మార్పులకు కూడా ఎంతో ప్రాధాన్యం ఉందని, విస్తృతస్థాయిలో ప్రపంచవ్యాప్తంగా అమిత వేగంతో ఈ చర్యలు చేపట్టాలని సూచించిన ప్రధాని మోదీ.. ఆ దిశగా భారత్ తన బాధ్యత నిర్వహిస్తోందని, 2030 కల్లా 450 గీగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని స్థాపించాలని భారత్ టార్గెట్ పెట్టుకుందని వివరించారు.

PM Modi announces India-Us Climate and Clean Energy partnership along with joe biden

వాతావరణంలో ప్రతికూల మార్పులను అడ్డుకునే దిశగా భారత్ చేస్తోన్న ప్రయత్నాలకు ఎన్నో సవాళ్లు ఎదురైన్నప్పటికీ.. పర్యావరణ హిత ఇంధన రంగం, అడవుల పెంపకం, జీవవైవిధ్యత వంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, పర్యావరణ రక్షణ కోసమే అమెరికా, భారత్‌ 'ఇండియా-యూఎస్ క్లైమెట్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 పార్టనర్షిప్' పేరిట ఓ కొత్త భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పుతున్నామని ఆయన పేర్కొన్నారు.

కరోనా విలయం: ఎన్నికలు యథాతథం -కేసీఆర్ సర్కారు పట్టు, ఎస్ఈసీ ప్రకటన -రద్దుకు హైకోర్టు నో చెప్పడంతోకరోనా విలయం: ఎన్నికలు యథాతథం -కేసీఆర్ సర్కారు పట్టు, ఎస్ఈసీ ప్రకటన -రద్దుకు హైకోర్టు నో చెప్పడంతో

పర్యావరణం పట్ల బాధ్యతాయుత వైఖరి కలిగిన భారత్ సుస్థిర అభివృద్ధి సాధించేందుకు సలహాలు , సూచనలను ఎల్లప్పుడూ స్వాగతిస్తుందని, ఖరీదైన హరిత సాంకేతికతను అభివృద్ధి చెందిన దేశాలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఇది ఉపయోగపడుతుందని, అందులో భాగంగానే భారత్, అమెరికా ఈ నూతన భాగస్వామ్యాన్ని నెలకొల్పాయని, లక్ష్యం చేరుకునేందుకు అవసరమైన నిధులు, సాంకేతికత, భాగస్వామ్యాలను రెండు దేశాలు కలిసి సాధిస్తాయని ప్రధాని మోదీ దీమా వ్యక్తం చేశారు. సమావేశంలో తొలుత ప్రసంగించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్..అమెరికా గ్రీన్ హౌస్ ఉద్గారాల్లో 2030 నాటికల్లా 50 నుంచి 52 మేర కోత విధిస్తామని ప్రకటించారు.

English summary
Prime Minister Narendra Modi on Thursday pitched for concrete action at a “high speed" and on a large scale to combat climate change, and asserted that India was doing its part to deal with the challenge. Addressing a US-hosted virtual summit of 40 global leaders, Modi also said sustainable lifestyles and guiding philosophy of “back to basics" must be important pillars of the economic strategy for the post-COVID era.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X