• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫోనీ ఎఫెక్ట్ః త‌క్ష‌ణ‌సాయం కింద రూ.1000 కోట్లు

|

న్యూఢిల్లీః ఫొని తుఫాన్ ప్ర‌భావానికి గురైన రాష్ట్రాల‌కుల కేంద్ర ప్ర‌భుత్వం ఆర్థిక స‌హాయాన్ని ప్ర‌క‌టించింది. తుఫాన్ ప్ర‌భావిత రాష్ట్రాల‌కు 1000 కోట్ల రూపాయ‌ల ఆర్థిక ప్యాకేజీని ప్ర‌క‌టించింది. ఈ మేరకు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఫొని ప్ర‌భావానికి గురైన రాష్ట్రాల‌కు త‌క్ష‌ణ స‌హాయ‌క చ‌ర్య‌ల కింద 1000 కోట్ల రూపాయ‌ల‌ను విడుద‌ల చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు చెప్పారు. అవ‌స‌ర‌మైతే ఆర్థిక ప్యాకేజీ మొత్తాన్ని మ‌రింత పెంచుతామ‌ని చెప్పారు.

<strong>బ‌ల‌హీన‌పడ్డ ఫోనిః బెంగాల్ వైపు ప్ర‌యాణంః క్ర‌మంగా అల్ప‌పీడ‌నంగా</strong>బ‌ల‌హీన‌పడ్డ ఫోనిః బెంగాల్ వైపు ప్ర‌యాణంః క్ర‌మంగా అల్ప‌పీడ‌నంగా

PM Modi announces Rs 1,000 cr relief package

లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. శుక్ర‌వారం ఆయ‌న రాజ‌స్థాన్‌లో ప‌ర్య‌టించారు. హిందౌన్‌లో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా మోడీ మాట్లాడుతూ- తుఫాన్ ప్ర‌భావిత రాష్ట్రాల‌కు గురువార‌మే ఆర్థిక ప్యాకేజీని విడుద‌ల చేసిన‌ట్లు చెప్పారు. ద‌క్షిణాదిన కోస్తా రాష్ట్రాలు పెను తుఫాన్ బారిన ప‌డ్డాయ‌ని గుర్తు చేశారు. వారికి అండ‌గా నిల్చోవాల్సిన అవ‌స‌రం యావ‌త్ దేశానికి ఉంద‌ని చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒడిశా, ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు, పుదుచ్చేరిల‌ను ఆదుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిసైనా ఉంద‌ని ఆయ‌న అన్నారు. తుఫాన్ స్థితిగ‌తుల‌పై తాను ఎప్ప‌టిక‌ప్పుడు ఆరా తీశాన‌ని, ఎలాంటి క‌ఠిన ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొడానికి సన్న‌ద్ధంగా ఉండాల‌ని తాను అధికారుల‌ను ఆదేశించిన‌ట్లు మోడీ ఎన్నిక‌ల స‌భ‌లో చెప్పుకొచ్చారు.

PM Modi announces Rs 1,000 cr relief package

బెంగాల్ వైపు ప్ర‌యాణం..

ఇదిలావుండ‌గా- బ‌ల‌హీన‌ప‌డుతున్న ఫొనీ తుఫాను క్ర‌మంగా త‌న దిశను మార్చుకుంటోంద‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. మ‌ధ్యాహ్నం ఒంటిగంట స‌మ‌యానికి గంట‌కు 12 కిలోమీట‌ర్ల వేగంతో ఉత్త‌ర దిశ‌గా క‌దులుతోంద‌ని పారాదీప్‌లోని రాడార్ నిర్ధారించిన‌ట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను వారు విడుద‌ల చేశారు. ఈ ఉద‌యం 9.30 గంట‌ల స‌మ‌యంలో ఫోని తుఫాన్ ఒడిశాలోని పూరీ వ‌ద్ద తీరాన్ని తాకిన విష‌యం తెలిసిందే. దీని దెబ్బ‌కు పూరీ, భువ‌నేశ్వ‌ర్‌, క‌ట‌క్ వంటి న‌గ‌రాలు, తీర ప్రాంత గ్రామాలు క‌కావిక‌లం అయ్యాయి. 180 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఫ‌లితంగా- అనేక చోట్ల చెట్లు నేల‌కూలాయి. విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. జాతీయ విప‌త్తు నిర్వ‌హ‌ణ బ‌ల‌గాలు వెనువెంట‌నే రంగంలోకి దిగి స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేశాయి.

English summary
Narendra Modi announces Rs 1,000 crore relief package: While addressing a rally in Rajasthan's Hidaun, Prime Minister Narendra Modi announced a Rs 1,000 crore relief package for Cyclone Fani. "We have gathered here today. At the same time people living in coastal areas in eastern and southern India are facing an extremely severe cyclone. The Centre is in continuous contact with governments in Odisha, West Bengal, Andhra Pradesh, Tamil Nadu and Puducherry. I took the latest update from officers. I held a review meeting yesterday," said the prime minister, adding that the nation was "with the people".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X