వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పౌరసత్వ సవరణ చట్టంతో ఎవరికీ హానీ కలగదు.. సంయమనం పాటించాలి: ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ స్పందించారు. పౌరసత్వ సవరణ బిల్లుపై ఆందోళనలు దురదృష్టకరమని అన్నారు. ఆందోళనలు చాలా ఆవేదనకు గురిచేస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ అంశంపైనైనా సరే డిబేట్, చర్చలు పెట్టి అసమ్మతిని తెలపాలే తప్ప ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ప్రజాజీవనంను డిస్టర్బ్ చేయడం సరికాదన్నారు ప్రధాని మోడీ.

పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చింది..ఇప్పుడేమో శివసేన కొత్త పల్లవి అందుకుందిపౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చింది..ఇప్పుడేమో శివసేన కొత్త పల్లవి అందుకుంది

పౌరసత్వ సవరణ చట్టంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని ప్రధాని మోడీ ప్రజలకు భరోసా ఇచ్చారు. ఈ చట్టం వల్ల ఎవరి మతానికి ఎలాంటి హాని కలగబోదని చెప్పారు. పొరుగుదేశాల్లో ఎవరైతే మతప్రాతిపదికన అణిచివేయబడ్డారో, వారు ఎటు వెళ్లాలో తెలియక భారత్‌కు చేరుకున్న వారికి మాత్రమే ఈ చట్టం బాసటగా నిలుస్తుందని ప్రధాని మోడీ అన్నారు. ఆందోళనవల్ల దేశం విభజన కాకూడదని ప్రధాని చెప్పారు. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరం కలిసి కృషి చేయాలని భావించారు. ప్రతి భారతీయుడు సాధికారికత కోసం పనిచేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా పేదలు, వెనకబడిన వారు అభివృద్ధి బాట పట్టేలా కృషి చేయాలని చెప్పారు.

PM Modi appeals for peace over violent protests

ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులు పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు తెలపడం ఆ తర్వాత అది హింసాత్మకంగా మారడంతో ప్రధాని ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది. ఆదివారం రోజున జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో ఆందోళనలు మిన్నంటాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఆందోళనకారులపై భాష్పప్రయోగం చేశారు. క్యాంపస్ లోపలికి ప్రవేశించిన పోలీసులు విద్యార్ధులను లాక్కెల్లారు. ఇక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆరు బస్సులు, 50 ఇతర వాహనాలకు నిప్పు పెట్టారు.

ఇదిలా ఉంటే జామియా మిలియా యూనివర్శిటీలో జరిగిన హింస సుప్రీంకోర్టుకు చేరింది. అయితే హింస తగ్గిన తర్వాతే విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే చెప్పడం జరిగింది. దీంతో ఈ కేసును మంగళవారం విచారణ చేసే అవకాశం ఉంది.

English summary
Condemning the ongoing violent protests against the Citizenship Amendment Act in various parts of the country, Prime Minister Narendra Modi Monday said that such agitations are “unfortunate and deeply distressing”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X