వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ప్రపంచమే నా కుటుంబం': ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ ఉత్సవాల హైలెట్స్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అందరికీ ప్రేమను పంచడమే తన జీవిత లక్ష్యమని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ అన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపించి 35 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఢిల్లీలోని యమునా తీరంలో నిర్వహిస్తున్న ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ప్రపంచంలోని ప్రజలను కలిపేందుకు ఐదు మాధ్యమాలు ఉన్నాయని చెప్పారు. అందరికీ ఆనందం పంచడమే జీవన విధానం అన్నారు. సమాజానికి ఎంత ప్రేమ పంచుతామో, అంతకు రెట్టింపు ప్రేమను తిరిగి పొందుతామని అన్నారు. ప్రపంచంలోని వివిధ మతాలు, సంస్కృతులు, సంప్రదాయాలు కలవారిని ఏకం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ కార్యక్రమం తన ప్రైవేట్ పార్టీ అని కొందరు విమర్శించారని, కొన్ని మంచి కార్యక్రమాలకు విఘ్నాలు కలగడం సహజమేనని చెప్పారు. ప్రపంచమే తన కుటుంబమని.... అందుకే అన్ని దేశాల నుంచి వచ్చిన ప్రజలు ఈ సమ్మేళనానికి వన్నె తెచ్చారని అన్నారు. సమస్యలు ఎదురైనా అధైర్య పడవద్దని, నవ్వుతూ ముందుకెళ్లాలని సూచించారు.

న్యూఢిల్లీలోని యమునా నది తీరంలో ప్రపంచ సాంస్కృతిక సమ్మేళనం ఉత్సవాలు శుక్రవారం సాయంత్రం హట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్ స్థాపించి 35 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

ఈ ఉత్సవాలకు భారత ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రపంచ సాంస్కృతిక సమ్మేళన ఉత్సవాల్లో పాల్గొనేందుకు 155 దేశాలకు చెందిన కళాకారులు, ప్రతినిధులతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ప్రపంచ సాంస్కృతిక సమ్మేళన ఉత్సవాలు ప్రారంభానికి ముందు తేలికపాటి వర్షం పడుతుండటంతో అక్కడికి చేరుకున్న సందర్శకులు ఇబ్బంది పడ్డారు.

ఈ ఉత్సవాలకు సంబంధించిన హైలెట్స్:

PM Modi arrives at World Culture Festival in Delhi

* ఢిల్లీ - నోయిడాల మధ్య వేయి ఎకరాల్లో జరుగుతున్న ఉత్సవాలు
* ఏడు ఎకరాల్లో ప్రధాన వేదిక
* ఇదొక సాంస్కృతిక ఒలింపిక్స్
* 37 వేల మంది కళాకారులు ఒకే వేదికపై పాలుపంచుకుంటున్నారు.
* ఆరు ఫుట్‌బాల్ క్రీడా మైదానాలు కలిసినంత అతి పెద్ద స్టేజ్.
* 150 దేశాలకు చెందిన 35,000 మంది కళాకారులు ప్రదర్శనలు
* 8,500 మంది సాంస్కృతిక బృందాలతో ప్రదర్శనలు
* ఈ కార్యక్రమానికి 35 లక్షల మంది హాజరవుతారని అంచనా
* 1700 మంది కళాకారులతో భరత నాట్యం
* పండితుల ఆధ్వర్యంలో సామూహిక ధ్యానాలు, ప్రార్థనలు
* తెలుగు రాష్ట్రాల నుంచి 800 మంది ప్రతినిధులు
* యుమునా నదిపై తాత్కాలిక వంతెనలు ఏర్పాటు చేశారు.
* ఈ ఉత్సవాలను కల్చరల్ ఒలింపిక్స్ గా రవిశంకర్ గురూజీ అభివర్ణించారు.
* మూడు వేల మందికి పైగా కూర్చునేందుకు వీలుగా భారీ వేదికను
* ఈ కార్యక్రమ నిర్వహణ కోసం 25 కోట్లకు పైగా ‌ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఖర్చు చేస్తోంది.
* స్టేజి నిర్మాణం కోసం 15.63 కోట్లు, దాని డెకరేషన్ కోసం మరో 10 కోట్లు ఖర్చు చేస్తుంది.

English summary
Cultural programmes underway at World Culture Festival in Delhi, PM Modi at the venue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X