వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంపీలు పాదయాత్ర చేపట్టండి.. మోడీ స్పష్టీకరణ.. ఎందుకో తెలుసా..!!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రధాని మోడీ కీలక భావిస్తోన్న అంశాలు రెండే. ఈ ఏడాది గాంధీ 150వ జయంతి, 2022లో భారతతేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతుంది. గాంధీతోపాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రజలతో మమేకం కావాలని, పాదయాత్రలు చేపట్టాలని బీజేపీ ఎంపీలకు పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులను తెలుసుకోవాలని, వారి సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలని స్పష్టంచేశారు.

పాదయాత్ర
అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా బీజేపీ ఎంపీలు పాదయాత్ర చేపట్టాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. గాంధీ జయంతి నుంచి అక్టోబర్ 31న మాజీ డిప్యూటీ పీఎం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వరకు 150 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టాలని సూచించారని తెలిపారు. తమ నియోజకవర్గంలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవాలని సూచించినట్టు వెల్లడించారు. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు మోడీ దిశానిర్దేశం చేసినట్టు తెలిపారు. బీజేపీ బలహీనంగా ఆయా చోట్ల రాజ్యసభ ఎంపీలు పర్యటించాలని ఇదివరకే మోడీ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.

PM Modi asks BJP MPs to embark on ‘padayatra’ on Gandhi birth anniversary

దూరదృష్టి
తమ పార్టీ ఎంపీల పాదయాత్రలో గ్రామాల జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా పర్యవేక్షించొచ్చని తెలిపారు. గ్రామాల్లో స్వయం పాలన, మొక్కలు నాటడం, బడ్జెట్ పద్దులపై వివరణ తదితర అంశాలను వివరించాలని స్పష్టంచేసినట్టు వెల్లడించారు. అంతేకాదు భావి భారతంతో ముందుచూపుతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదించారనే విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ తమ బడ్జెట్‌లో ప్రతిబింబిస్తాయని జోషి స్పష్టంచేశారు.

English summary
Prime Minister Narendra Modi has instructed BJP MPs to embark on ‘padayatra’ in their constituencies and cover a distance of 150 km between October 2 and October 31, the birth anniversaries of Mahatma Gandhi and Vallabhbhai Patel respectively, Parliamentary Affairs Minister Pralhad Joshi said Tuesday. Addressing the BJP parliamentary party meeting, Modi also asked Rajya Sabha members to visit constituencies where the BJP organisation was weak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X