వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ఆస్తులు స్వల్పంగా పెరిగాయి, అమిత్ షా తగ్గాయి.. వివరాలివే...

|
Google Oneindia TeluguNews

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆస్తుల స్వల్పంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే పెరగగా.. ఇటు హోంమంత్రి అమిత్ షా ఆస్తులు మాత్రం స్వల్పంగా తగ్గాయి. ఇద్దరు కీలక నేతల ఆస్తులు పెరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇద్దరిదీ ఓకేలా ఉండలేదు. ఒకరివీ పెరగగా.. మరొకరివీ తగ్గాయి.

గతేడాదితో పోలిస్తే ప్రధాని మోడీ ఆస్తి విలువ స్వల్పంగా పెరిగింది. జూన్‌ 30, 2020 నాటికి మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 2.85 కోట్లు. ప్రధాని కార్యాలయానికి ఇటీవల సమర్పించిన నివేదికలో తనకు సంబంధించిన ఆస్తుల వివరాలను మోడీ పొందుపరిచారు. జూన్‌ నెల ముగిసేనాటికి ప్రధాని మోదీ వద్ద రూ. 31,450 నగదు ఉండగా, ఎస్బీఐ గాంధీనగర్‌ ఎన్‌ఎస్‌సీ శాఖకు చెందిన ఆయన బ్యాంకు ఖాతాలో 3,38,173 రూపాయలు ఉన్నాయి. అదే బ్రాంచ్‌లో ఓ ఎఫ్‌డీఆర్‌ కూడా ఉంది. మల్టీ ఆప్షన్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో రూ. 1,60,28,939 నిల్వ ఉన్నట్లు మోదీ వెల్లడించారు.

 pm modi assests are increased..

నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్స్‌‌ విలువ రూ. 8,43,124గా పేర్కొన్నారు. జీవిత బీమా పాలసీల విలువ రూ. 1,50,597, టాక్స్‌ సేవింగ్‌ ఇన్‌ఫ్రా బాండ్ల విలువ రూ. 20 వేలు, వీటితో పాటు చరాస్తుల విలువ 1.75 కోట్లకు పైగా ఉంటుందని వెల్లడించారు. అయితే ఆయనకు ఏ బ్యాంకులోనూ రుణాలు లేవు. సొంత వాహనం కూడా లేదు. ప్రధాని మోదీ వద్ద, సుమారు 45 గ్రాముల బరువుగల నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వాటి విలువ రూ. 1.5 లక్షలు ఉంటుంది.

గాంధీనగర్‌ సెక్టార్‌-1లో తనకు ఓ ప్లాట్‌ ఉందని మోడీ వెల్లడించారు. 3,531 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలంపై ముగ్గురికి సమాన హక్కు ఉందని పేర్కొన్నారు. సుమారు పద్దెనిమిదేళ్ల క్రితం గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడానికి ముందే ఆయన ఈ స్థలం కొనుగోలు చేసినట్లు సమాచారం. అప్పుడు ఆ ప్లాట్‌ విలువ 1.3 లక్షల రూపాయలు. ఇక ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం, ప్రధాని మోదీ స్థిరాస్తి విలువ రూ. 1.10 కోట్లు ఉంటుందని అంచనా.

Recommended Video

Telanagana CM & Ministers To Upload Their Assets In Dharani App - Jagga Reddy | Oneindia Telugu

సంపన్న కుటుంబానికి చెందిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సంపదలో తగ్గుదల కనిపించింది. జూన్‌ 2020 నాటికి అమిత్‌ షా ఆస్తి విలువ రూ. 28.63 కోట్లు అని ప్రకటించారు. అయితే గతేడాది రూ. 32.3 కోట్లుగా అమిత్ షా ఆస్తి ఉండేది.

English summary
prime minister narendra modi assets increased and home minister amith shah assets are decreased.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X