PM Modi: ప్రధాని బెంగళూరు టూర్, ఎన్ని రూ. కోట్లు ఖర్చు అయ్యిందో తెలుసా ?, బీబీఎంపీ క్లారిటీ !
బెంగళూరు/ మైసూరు: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులు కర్ణాటకలో పర్యటించిన విషయం తెలిసిందే. సోమవారం మద్యాహ్నం బెంగళూరు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఐటీ హబ్ లో పలు కార్యక్రమాల్లో పాల్గోన్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మైసూరు వెళ్లారు. మైసూరులో మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గోన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు వచ్చిన సందర్బంగా బీబీఎంపీ అధికారులు ఎంత డబ్బులు ఖర్చు చేశారు అనే విషయం బయటకు రావడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన సందర్బంగా ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని బీబీఎంపీ అధికారులు చెప్పిన వివరాలకు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన సందర్బంగా 23 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని బీబీఎంపీ అధికారులు అంటున్నారు. యలహంక ఎయిర్ ఫోర్స్ ఎయిర్ పోర్టు నుంచి ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో పర్యటించిన ప్రాంతాల్లో తారు రోడ్లు వెయ్యడానికి 14 కోట్ల రూపాయల ఖర్చు అయ్యిందని బీబీఎంపీ అధికారులు తెలిపారు.
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీతో మైసూరు రాజవంశస్తులు బ్రేక్ ఫాస్ట్, మెనూలో ఏం ఉందంటే, మైసూర్ పాక్ !
ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన సందర్బంగా తారు రోడ్లతో పాటు డ్రైనేజ్ ల మరమత్తులు, వీధి దీపాలు, రంగులకు 23 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యిందని బీబీఎంపీ ప్రత్యేక కమీషనర్ రవీంద్ర ఆయనను కలిసిన మీడియాకు చెప్పారు. ప్రధాని మోదీ బెంగళూరు వచ్చిన సందర్బంలో తారు రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజ్ ల మరమత్తులకు ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అధికారులు ఇంతకాలం ప్రజల సమస్యలు పట్టించుకోకుండా నిద్రపోతున్నారా అని ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు.