వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీతో తొలిసారి.. ఫేస్‌టైమ్‌లో బైడెన్ -నాలుగు దేశాలకు కీలకం -రీజన్ ఇదే..

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జోబైడెన్ తొలిసారిగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. అయితే, నేరుగా మాత్రం కాదు.. వర్చువల్ మీటింగ్ (ఫేస్ టైమ్ లో) మాత్రమే. ఇండో-పసిఫిక్ రీజియన్ లో చైనా దూకుడును అడ్డుకునేలా ఈ ప్రాంతంలోని నాలుగు దేశాలు అత్యంత కీలకంగా భావిస్తోన్న ఈ భేటీలో అగ్ర నేతలు ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది..

 కేంద్రానికి అల్టిమేట్ వార్నింగ్ -ట్రాక్టర్లే యుద్ధ ట్యాంకులు -బారికేడ్లు బద్దలు కొట్టుడే: టికాయత్ కేంద్రానికి అల్టిమేట్ వార్నింగ్ -ట్రాక్టర్లే యుద్ధ ట్యాంకులు -బారికేడ్లు బద్దలు కొట్టుడే: టికాయత్

ఆస్ట్రేలియా నిర్వ‌హించ‌నున్న క్వాడ్ స‌మావేశంలో ఆ ఇద్ద‌రు నేత‌లు క‌లుసుకోవడం దాదాపు ఖరారైంది. క్వాడ్‌లోని స‌భ్య‌దేశాలైన అమెరికా, జ‌పాన్‌, ఆస్ట్రేలియా, ఇండియా త్వ‌ర‌లో భేటీకానున్న‌ట్లు ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్ శుక్రవారం ప్ర‌క‌టించారు. చైనా ఆధిప‌త్యాన్ని ఢీకొట్టేందుకు క్వాడ్ గ్రూపును ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. కాగా,

 PM Modi, Biden May Meet Virtually As Australian PM Announces Quad Event

ఇటీవ‌ల చైనాతో అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు క‌య్యానికి దిగడం, ప‌లు ద్వైపాక్షిక‌, వాణిజ్య అంశాల్లో చైనాతో ఆ రెండు దేశాలకు తీవ్రస్థాయిలో విభేదాలు రావడం తెలిసిందే. ఇటీవ‌ల స‌రిహ‌ద్దు అంశంలోభార‌త్‌తోనూ చైనా త‌గాదా కొనసాగుతోన్న దరిమిలా ఈసారి జరగబోయే క్వాడ్ భేటీకి ప్రధాన్యం లభించింది.

 జగన్ దెబ్బకు రోడ్డున పడ్డ షర్మిల -ఏపీలో ఏబీసీడీ పాలన -ఏం పీకారు? -కర్నూలులో చంద్రబాబు నిప్పులు జగన్ దెబ్బకు రోడ్డున పడ్డ షర్మిల -ఏపీలో ఏబీసీడీ పాలన -ఏం పీకారు? -కర్నూలులో చంద్రబాబు నిప్పులు

అమెరికా అధ్య‌క్షుడిగా బైడెన్ ఎన్నికైన త‌ర్వాత ప్ర‌ధాని మోదీ ఓసారి ఫోన్‌లో సంభాషించారు. ఆ ఇద్ద‌రి మ‌ధ్య వ‌ర్చువ‌ల్ భేటీ జరగడం మాత్రం ఇదే తొలిసారి. కానీ, క్వాడ్ మీటింగ్‌కు సంబంధించి భారత ప్ర‌ధాన‌మంత్రి కార్యాల‌యం ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌కున్నా, స‌ద‌స్సుకు మోదీ, బైడెన్ హాజ‌రు అవుతార‌ని ఆసీస్ పేర్కొంది. ఇండో-ప‌సిఫిక్ ప్రాంతంలో శాంతి, ర‌క్ష‌ణ కోసం నాలుగు దేశాలు ప‌నిచేయ‌నున్న‌ట్లు స్కాట్ తెలిపారు.

English summary
Prime Minister Narendra Modi and US President Joe Biden may meet when leaders of the "Quad" bloc of US, India, Japan and Australia come together in a virtual meeting teased by Australian Prime Minister Scott Morrison on Friday. This could be PM Modi's first meeting with Biden since he took over as US President in November, even though they spoke on the phone after the Democrat victory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X