వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రోటోకాల్ పక్కన పెట్టి ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహుకు మోడీ స్వాగతం

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

మోదీ.. విప్లవాత్మక నాయకుడు.. -ఇజ్రాయిల్ ప్రధాని నెతాన్యాహు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రోటోకాల్ ను కూడ పక్కన పెట్టి ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమెన్‌ నెతన్యూహుకు స్వాగతం పలికారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళి నెతన్యూహుకు మోడీ స్వాగతం పలికారు. అంతేకాదు మోడీ ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం చెప్పారు.

ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుతో కలిసి మోదీ తీన్‌ మూర్తి చౌక్‌కు వెళ్తారు. అక్కడ జరుగనున్న కార్యక్రమంలో ఇరు దేశాధినేతలు పాల్గొంటారు. ఈ సందర్భంగా తీన్‌ మూర్తి చౌక్‌ పేరును తీన్‌ మూర్తి హైఫీ చౌక్‌గా మార్చనున్నారు.

నెతన్యాహు పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఇవాళ రాత్రి ఆయనకు ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నెతన్యాహు వెంట ముంబై పేలుళ్ల నుంచి సురక్షితంగా బయటపడిన 11ఏళ్ల బాలుడు మోషే కూడా భారత్‌ వచ్చాడు. బెంజమిన్ భారత్ లో 6 రోజులపాటు పర్యటించనున్నారు.

భారత్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను కొత్త పుంతలు తొక్కిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఉన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన ఆత్మీయ స్వాగతంపై ఓ ట్వీట్‌లో నెతన్యాహు సంతోషం వ్యక్తం చేశారు. 'స్యయంగా విచ్చేసి నాకు స్వాగతం పలికిన ఆప్త మిత్రుడు మోదీకి ధన్యవాదాలంటూ నెతాన్యాహూ ట్వీట్ చేశారు.

ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే ఆయన ఇచ్చిన స్వాగతం నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఉభయదేశాల మధ్య సబంధాలను ఇద్దరం కలిసి సరికొత్త ఎత్తులకు తీసికెళ్తాం' అని ఆ ట్వీట్‌లో నెతన్యాహు పేర్కొన్నారు.

PM Modi breaks protocol, receives Benjamin Netanyahu at airport with a hug

మోదీ సైతం నెతన్యాహు భారత్‌లో పర్యటించడం చరిత్రాత్మకమని, ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు ఆయన రాకతో మరింత పరిపుష్టమవుతాయని ఆశిస్తున్నానని ట్వీట్ చేశారు.

నెతన్యాహును మోదీ గాఢాలింగనం చేసుకోవడంపై కాంగ్రెస్ తన అఫీషియల్ ట్విట్టర్లో 'హగ్ డిప్లొమసీ' అంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భారత్ రాకతో పీఎం మోదీ నుంచి మరిన్ని హగ్‌లు చూడబోతున్నాం అంటూ ట్వీట్ చేసింది.

దీనిపై బీజేపీ మండిపడింది. ఒక విదేశీ ప్రముఖుడు ఇండియాలోకి అడుగుపెట్టిన వేళ ప్రధాని మోదీపై వ్యంగ్య వ్యాఖ్యలు చేయడం ఏమిటంటూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగింది.

English summary
Prime Minister Narendra Modi on Sunday broke protocol to personally receive his Israeli counterpart Benjamin Netanyahu at the airport as he arrived in the national capital to begin a six-day visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X