• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మోదీ తప్పులకు మంత్రులు బలి -ఇది కేంద్ర కేబినెట్ ప్రక్షాళన కాదు, ప్రాయశ్చిత్తం: చిద్దూ ఫైర్

|

దేశంలో కరోనా మహమ్మారిని నియంత్రించడంలో, మూడో వేవ్ ముప్పు తొలగేలా అందరికీ వ్యాక్సిన్లు అందించడంలో మోదీ సర్కార్ దారుణంగా విఫలమైందన్న ఆరోపణల నేపథ్యంలో ఏకంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయడం ముమ్మాటికీ ప్రాయశ్చిత్తంగా జరిగిందేనని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. బుధవారం నాటి కేంద్ర మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్ సీనియర్ నేతలు పి.చిదంబరం, జైరాం రమేశ్, రణదీప్ సుర్జేవాలా తదితరులు అనూహ్య విమర్శలు చేశారు..

అసాధారణం: అధ్యక్షుడి ఇంట్లోకి చొరబడి కాల్పులు, హైతీ దేశాధినేత హతం, భార్యకూ బుల్లెట్లుఅసాధారణం: అధ్యక్షుడి ఇంట్లోకి చొరబడి కాల్పులు, హైతీ దేశాధినేత హతం, భార్యకూ బుల్లెట్లు

మోదీ కోసం మత్రులు బలి

మోదీ కోసం మత్రులు బలి

కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 43 మంది మంత్రులు రాష్ట్రపతి భవన్‌లో బుధవారం ప్రమాణం చేశారు. వీరిలో 15 మందికి కేబినెట్ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులు. అయితే, ప్రమాణాలకు ముందే ఏకంగా 12 మంది కేంద్ర మంత్రులు రాజీనామా చేయడం వారిలో కీలకమైన ఆరోగ్య, విద్యా, ఐటీ, ఐబీ శాఖల మంత్రులు కూడా ఉండటం సంచలనం రేపింది. కొవిడ్ నియంత్రణకు సంబంధించి ఐక్యరాజ్య సమితిలోనూ కీలక పాత్ర పోషిస్తోన్న భారత ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ను తొలగించడంపై విపక్ష కాంగ్రెస్ విస్మయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ అధినేతగా ప్రధాని మోదీ చేసిన తప్పులకు మంత్రులను బలి చేశారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.

జగన్‌తో పోరు ఉధృతం: ఏపీ జల దోపిడీపై 6గంటలు సమీక్ష -కృష్ణాపై కేసీఆర్ కీలక నిర్దేశంజగన్‌తో పోరు ఉధృతం: ఏపీ జల దోపిడీపై 6గంటలు సమీక్ష -కృష్ణాపై కేసీఆర్ కీలక నిర్దేశం

ప్రాయశ్చిత్తం.. గుణపాఠం

ప్రాయశ్చిత్తం.. గుణపాఠం

‘‘పెద్ద సంఖ్యలో మంత్రుల రాజీనామాల వల్ల మనకు తెలుస్తోన్న పాఠమేంటంటే, ఒకవేళ పరిస్థితులన్నీ సజావుగా సాగితే ఆ విజయం ప్రధాని మోదీ ఖాతాలోకి వెళుతుంది. అదే, పరిస్థితులు తారుమారై సర్కారు ఫెయిలైతే మాత్రం సదరు బాధ్యతను మంత్రులు తీసుకోవాల్సి ఉంటుంది. అవ్యక్త విధేయత, ప్రశ్నించలేని మంత్రులు చెల్లించే ధర ఇది'' అని పి. చిదంబరం అన్నారు. ప్రధానంగా ఆరోగ్య మంత్రి రాజీనామాను యావత్ దేశం మోదీ(కేంద్రం) తన తప్పులకు చేసుకున్న ప్రాయశ్చితంగానే చూస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు.

రాజీనామా చేయాల్సింది మోదీనే

రాజీనామా చేయాల్సింది మోదీనే


‘‘కరోనా పరిస్థితుల్లో విపత్తు నిర్వహణ విభాగం పూర్తిగా చేతులెత్తేసింది. ప్రజల్ని గాలికొదిలేసింది. జాతీయ విపత్తు నిర్వహణను తన దగ్గరే ఉంచుకున్న ప్రధాని మోదీనే దీనికి బాధ్యత వహించాలి. ఒకవేళ రాజీనామా చేయాల్సి వస్తే గనుక మోదీనే ముందుగా తప్పుకోవాలి''అని ఏఐసీసీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తుండగా, కేంద్ర విద్యా శాఖ మంత్రిని తొలగించడం కూడా మోదీ వైఫల్యానికి మచ్చుతునకే అని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.

  AP Cabinet Writes To krishna River Board On Srisailam Power Issue Targeting TS Genco|Oneindia Telugu
  English summary
  The Congress went on a jibe overdrive today as news of Prime Minister Narendra Modi's cabinet reshuffle slowly unfolded. The satisfaction was evident as several ministers handling a clutch of crucial ministries resigned. senior Congress leader and former Union minister P Chidambaram immediately tweeted about an inherent "lesson". Chidambaram also said that it was a "confession" about his handling of the Covid pandemic. Another leader Jairam Ramesh, tweeted, "Poor Dr. Harsh Vardhan, a good man has been made a scapegoat for monumental failures at the highest level — nowhere else".
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X