వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ: జ్యోతిరాదిత్య సింధియా, వరుణ్ గాంధీ, లడఖ్ ఎంపీలకు ఛాన్స్!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణ కసరత్తులు చివరి దశకు చేరాయి. ఇప్పటికే కీలక మంత్రులతో ప్రధాని మోడీ రెండుసార్లు వేర్వేరుగా సమావేశమయ్యారు. దీర్ఘకాలంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అతి త్వరలో జరుగనుంది. కేంద్రమంత్రివర్గంలో చోట దక్కించుకునే అవకాశం ఉన్న పలువురు కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి.

మోడీ కేంద్రమంత్రివర్గంలో ఖాళీలు, అదనపు బాధ్యతలు

మోడీ కేంద్రమంత్రివర్గంలో ఖాళీలు, అదనపు బాధ్యతలు

మే 30, 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ జరుగుతుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. లోక్ జన్‌శక్తి పార్టీ వ్యవస్థాపకుడు రాంవిలాస్ పాశ్వాన్, బీజేపీ నేత సురేష్ అంగాడి మరణం తర్వాత ఆ మంత్రి పదవులు ఖాళీ అయ్యాయి. ఎన్డీఏ నుంచి వైదొలిగిని శిరోమణి అకాళీదళ్, శివసేనకు చెందిన ఇద్దరు మంత్రులు కూడా రాజీనామా చేయడంతో ఆ పదవులు కూడా ఇప్పుడు ఖాళీగానే ఉన్నాయి. మరోవైపు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం కామర్స్ అండ్ ఇండస్ట్రీ, పుడ్ అండ్ కన్జూమర్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖను కూడా చూసుకుంటున్నారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వద్దే గ్రామీణాభివృద్ధి శాఖ ఉంది. వీటిని కూడా ఇతరులకు కేటాయించే అవకాశం ఉంది. మరోవైపు పనితీరు బాగోలేని మంత్రులను కూడా పక్కనే పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జ్యతిరాదిత్య సింధియాకు మోడీ కేబినెట్‌లో అవకాశం?

జ్యతిరాదిత్య సింధియాకు మోడీ కేబినెట్‌లో అవకాశం?

ఎన్నికలు జరుగున్న రాష్ట్రాల నుంచి నేతలను మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం ఉంది. గ్రామీణాభివృద్ధి శాఖను అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బనాంద సోనోవాల్ కు కేటాయించే అవకాశం ఉన్టన్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ కేంద్రమంత్రి, నాలుగుసార్లు లోక్‌సభ ఎన్నికైన జ్యోతిరాదిత్య సింధియాకు ఈసారి కేంద్రమంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. టీఎంసీ నుంచి బీజేపీలో చేరిన దినేష్ త్రివేదికి కూడా మంత్రివర్గంలో చేరుతున్నట్లు సమాచారం. రాజస్థాన్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు భూపేందర్ యాదవ్ కూడా మోడీ మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్నట్లు సమాచారం.

Recommended Video

IAS Srilakshmi కి రూట్ క్లియర్.. అన్నీ అనుకూలిస్తే AP CS, Ys Jagan స్పెషల్ ఫోకస్ || Oneindia Telugu
మోడీ మంత్రివర్గంలో వరుణ్ గాంధీ, లడఖ్ ఎంపీకి కూడా ఛాన్స్..?

మోడీ మంత్రివర్గంలో వరుణ్ గాంధీ, లడఖ్ ఎంపీకి కూడా ఛాన్స్..?

బీజేపీలో చేరిన ఒడిశా కేడర్ ఐఏఎస్ అధికారి అశ్వినీ బైష్నబ్ కూడా కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది. మాజీ కేంద్రమంత్రి మేనకా గాంధీ తనయుడు, ఫిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీని తొలిసారి కేంద్రమంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఆర్టికల్ 360 రద్దు సమయంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన లఢఖ్ ఎంపీ జమ్యంగ్ సెరింగ్ నంగ్యాల్ కూడా తొలిసారి మంత్రివర్గంలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా, మోడీ ప్రభుత్వం 2019 మే 30న రెండోసారి ప్రమాణ స్వీకారం చేసింది. దీనికి 57 మంది మంత్రులు (24 క్యాబినెట్ మంత్రులు, 9 రాష్ట్ర మంత్రులు (స్వతంత్ర ఛార్జ్), 24 రాష్ట్ర మంత్రులు) ఉన్నారు, మొదటిసారి మోడీ ప్రభుత్వం కంటే 12 ఎక్కువ ఉన్నారు.

English summary
PM Modi Cabinet reshuffle: Jyotiraditya Scindia and Varun Gandhi, Jamyang Tsering Namgyal likely to be inducted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X