వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ పోస్టు ఓ గొప్ప సంస్కరణ: ప్రధాని మోడీ ట్వీట్

|
Google Oneindia TeluguNews

భారత దేశ భద్రత దృష్ట్యా చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌ పోస్టును సృష్టించడం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ విషయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌గా బాధ్యతలు చేపట్టిన మేజర్ జనరల్ బిపిన్ రావత్‌కు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. రక్షణ వ్యవస్థలో ఇలాంటి సంస్కరణలు తీసుకురావడం ఎంతో గొప్ప విషయమని ప్రధాని మోడీ చెప్పారు. దేశ భద్రత పట్ల తమ ప్రభుత్వం ఎక్కడా రాజీపడదని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. భద్రత విషయంలో భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పిన ప్రధాని వాటన్నిటినీ విజయవంతంగా ఎదుర్కొనేందుకే ఇలాంటి కీలక పోస్టు ఒకటి ప్రభుత్వం సృష్టంచాల్సి వచ్చిందని ట్వీట్ చేశారు.

మిలటరీ వ్యవహారాల కోసం కొత్త శాఖను సృష్టించినట్లు గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపేరును సైన్యకర్త విభాగ్‌గా ఖరారు చేసింది. దీనికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ అధిపతిగా వ్యవహరిస్తారని పేర్కొంది. ఇక దీని కింద రక్షణ శాఖ, రక్షణ ఉత్పత్తి, డిఫెన్స్ రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్, ఎక్స్ సర్వీస్‌ సంక్షేమ శాఖలు ఉంటాయని పేర్కొంది.

PM Modi calls CDS ‘momentous, comprehensive reform’ after Gen Bipin Rawat takes charge

ఆగష్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో భారత్‌కు చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పినట్లు గుర్తు చేసిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ మేరకు మాటను నిలబెట్టుకున్నామని మరో ట్వీట్ చేశారు.మొత్తం భారత మిలటరీ వ్యవస్థను ఆధునీకరిస్తామని చెప్పారు. 130 కోట్ల భారతీయుల కలలను ఆకాంక్షలను సాకారం చేస్తామని ప్రధాని చెప్పారు.

1999 కార్గిల్ యుద్ధం తర్వాత కే సుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ నాడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే గత ప్రభుత్వాలు దీన్ని అమలు చేయలేదు. ఇక ఈ రిపోర్టును ఫిబ్రవరి 2000లో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న ఈ అంశం మోడీ సర్కార్ రెండో సారి అధికారంలోకి రాగానే తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఇదొకటని అనలిస్టులు చెబుతున్నారు.

English summary
Prime Minister Narendra Modi on Wednesday said the appointment of the chief of defence staff (CDS) was a momentous and comprehensive reform that would help India face challenges of modern warfare, a day after General Bipin Rawat’s appointment to the top post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X