వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ శతాబ్దం ఆసియాదే, భాగస్వామ్యం అవసరం: చైనాలో మోడీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

షాంగై: ఈ శతాబద్దం ఆసియాదే అని బలంగా నమ్ముతున్నామని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చైనాలో మూడో రోజు పర్యటనలో భాగంగా షాంఘైలో 22 మంది సీఈవోలతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో వస్తువుల ఉత్పత్తి కోసం మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం చేపట్టామన్నారు.

యువతకు ఉపాధి లక్ష్యంగా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఆసియాలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధికి భారత్‌-చైనా భాగస్వామ్యం అవసరమని మోడీ అన్నారు.రైల్వేలను ఆధునీకరిస్తామని, 50 నగరాల్లో మెట్రో రైలుకు ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. పారిశ్రామిక కారిడార్లు, ఆకర్షణీయ నగరాలు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

ఈ రోజు కార్టూన్

సీఈవోలతో చర్చలు ఫలప్రదంగా జరిగాయని తెలిపారు. భారత్‌ - చైనా మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని, భగవద్గీత, రామాయణం, మహాభారతం లాంటి భారతీయ పురాణాలకు చైనాలో ఎంతో ప్రాచుర్యం ఉందన్నారు. పేదరికాన్ని ఎదుర్కునే శక్తి భారత్‌, చైనాలకు ఉందని ప్రధాని మోడీ తెలిపారు.

కాగా, మోడీ చైనాలో మూడు రోజుల పర్యటన సందర్భంగా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలకు అవగాహన కుదిరింది. భవిష్యత్‌లో చైనాతో వాణిజ్యానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందని మోడీ ప్రకటించారు. మొత్తం 21 ఒప్పంద పత్రాలపై చైనా-భారత్ ప్రతినిధులు ఆయన సమక్షంలో సంతకాలు చేశారు. చైనా పర్యటన పట్ల మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు.

చైనాలో మోడీ

చైనాలో మోడీ

ఈ శతాబద్దం ఆసియాదే అని బలంగా నమ్ముతున్నామని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

చైనాలో మోడీ

చైనాలో మోడీ

చైనాలో మూడో రోజు పర్యటనలో భాగంగా షాంఘైలో 22 మంది సీఈవోలతో ప్రధాని మోడీ సమావేశమయ్యారు.

ఈ శతాబ్దం ఆసియాదే, భాగస్వామ్యం అవసరం: చైనాలో మోడీ

ఈ శతాబ్దం ఆసియాదే, భాగస్వామ్యం అవసరం: చైనాలో మోడీ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో వస్తువుల ఉత్పత్తి కోసం మేక్‌ ఇన్‌ ఇండియా కార్యక్రమం చేపట్టామన్నారు.

చైనాలో మోడీ

చైనాలో మోడీ

యువతకు ఉపాధి లక్ష్యంగా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు.

చైనాలో మోడీ

చైనాలో మోడీ

ఆసియాలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక అభివృద్ధికి భారత్‌-చైనా భాగస్వామ్యం అవసరమని మోడీ అన్నారు.

చైనాలో మోడీ

చైనాలో మోడీ

రైల్వేలను ఆధునీకరిస్తామని, 50 నగరాల్లో మెట్రో రైలుకు ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. పారిశ్రామిక కారిడార్లు, ఆకర్షణీయ నగరాలు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు.

చైనాలో మోడీ

చైనాలో మోడీ

మోడీ చైనాలో మూడు రోజుల పర్యటన సందర్భంగా ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాలకు అవగాహన కుదిరింది. భవిష్యత్‌లో చైనాతో వాణిజ్యానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందని మోడీ ప్రకటించారు.

English summary
Calling for a 'harmonious partnership' between India and China, Prime Minister Narendra Modi today said it was essential for economic development and political stability of Asia.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X