• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శ్రీలంక అధ్యక్షుడు,మారిషస్‌ ప్రధానిలకు మోదీ ఫోన్... ఏం మాట్లాడారంటే..?

|

భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సే,మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నౌత్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ రెండు ద్వీపాల్లోనూ చైనా తమ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తుండటంతో భారత్‌ కూడా అక్కడ తమ సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో రాజపక్సేతో మాట్లాడిన మోదీ.. శ్రీలంకలో భారత సహాయంతో చేపడుతున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయాల్సి ఉందని చర్చించారు. శ్రీలంకలో భారత ప్రైవేట్ రంగం పెట్టుబడులను ప్రోత్సహిస్తామని ఈ సందర్భంగా మోదీ హామీ ఇచ్చారు. గొటబయ రాజపక్సే నాయకత్వంలో శ్రీలంక కోవిడ్19ని సమర్థవంతంగా ఎదుర్కొంటోందని మోదీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో శ్రీలంకకు భారత్ సాయం కొనసాగుతుందని హామీ ఇచ్చినట్టు తెలిపారు.

మారిషస్ ప్రధానితో ఏం మాట్లాడారు..

మారిషస్ ప్రధానితో ఏం మాట్లాడారు..

మారిషస్ ప్రధాని ప్రవింద్‌తో ఫోన్ కాల్ సందర్భంగా.. మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో నావల్ షిప్ కేసరి ద్వారా తమకు అవసరమైన మెడికల్ సామాగ్రితో పాటు 14 మంది వైద్య నిపుణుల బృందాన్ని పంపించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మోదీ మాట్లాడుతూ.. మారిషస్‌లో పలు రంగాల అభివృద్దికి భారత్ సహాయ,సహకారాలు అందిస్తుందన్నారు. ఫైనాన్షియల్ సెక్టార్‌లోనూ తమ మద్దతు ఉంటుందని చెప్పారు.

ఎందుకీ ఫోన్ కాల్స్..

ఎందుకీ ఫోన్ కాల్స్..

మోదీ ఫోన్ కాల్స్‌పై వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకుడు ఉదయ్ భాస్కర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... భారత్ తమ పొరుగునే ఉన్న చిన్న దేశాలతో స్నేహ సంబంధాలను విస్తరించుకోవడం ద్వారా మరింత విశ్వసనీయతను ప్రోది చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలిపారు. భారత్ చేసే ఏ ప్రయత్నం గురించి చైనా ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా.. దీర్ఘ కాలంలో ఇలాంటి చర్యలు దేశం పట్ల విశ్వసనీయతను పెంచుతాయన్నారు.

  Went To Harbhajan’s Room To Fight After Match - Shoaib Akhtar
  చైనాతో వివాదం నేపథ్యంలో..

  చైనాతో వివాదం నేపథ్యంలో..

  గత కొన్ని వారాలుగా భారత్‌లోని సిక్కీం సరిహద్దు వద్ద ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో వాగ్వాదం నెలకొన్న పరిస్థితుల్లో.. మోదీ తాజా ఫోన్ కాల్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భారత్ పొరుగున ఉన్న దేశాలైన శ్రీలంక,మారిషస్‌లపై చైనా ఆధిపత్యం బలపడకుండా ఉండాలంటే.. భారత్ కూడా ఆ దేశాలతో పటిష్టమైన సంబంధాలను ఏర్పరుచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో సౌత్ ఏసియా రీజియన్‌లో కరోనా నియంత్రణ కోసం ఇప్పటికే భారత్ 10మిలియన్ డాలర్లను ఆఫర్ చేసింది. అలాగే 8 సౌత్ ఏసియన్ దేశాలకు టెక్నికల్ సపోర్ట్‌తో పాటు మానవ శక్తి సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది.

  English summary
  Prime Minister Narendra Modi on Saturday spoke with Sri Lanka’s president Gotabaya Rajapaksa and PK Jugnauth, his counterpart in Mauritius, continuing to engage with neighbouring countries during the coronavirus pandemic.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more