వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Omicron virus:కొత్త వేరియంట్‌పై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమీక్ష

|
Google Oneindia TeluguNews

కరోనా కొత్త వేరియంట్ భయాందోళన కలిగిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలతో అన్నీ దేశాలు అలర్ట్ అయ్యాయి. భారత్ కూడా అప్రమత్తం అయ్యింది. దేశంలో కరోనా వైరస్, వ్యాక్సినేషన్ గురించి ఇవాళ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ, ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, యూనియన్ హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషన్, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ తదితరులు హాజరయ్యారు.

21.1 శాతం తక్కువ కేసులు

21.1 శాతం తక్కువ కేసులు


గత 24 గంటల్లో దేశంలో 8 వేలకు పైగా కేసులు వచ్చాయి. శుక్రవారంతో పోలిస్తే 21.1 శాతం తక్కువ కేసులు నమోదయ్యాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మిజోరంలో ఎక్కువ కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో 465 మరణాలు సంభవించాయి. ఇటు గత 24 గంటల్లో 73,58,017 వ్యాక్సిన్ ఇచ్చారు. దీంతో 1,21,06,58,262 మొత్తానికి చేరింది.

కరోనా గజ గజ

కరోనా గజ గజ

కొత్త కరోనా వేరియంట్ గజ గజ వణికిస్తోంది. ఇదీ సార్స్ కొవ్-2 అని.. ఆఫ్రికాలోని బొట్స్వానాలో తొలుత వెలుగుచూసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీని పేరు ఓమిక్రాన్‌గా నామకరణం చేశారు. వైరస్ వివిధ రకాలుగా రూపాంతరం చెందుతుందని తెలిపారు. ఈ నెల 26వ తేదీన గుర్తించామని వివరించారు. వైరస్ తొలుత సౌతాఫ్రికాలో బయటపడింది. అయితే ఈ నెల 9వ తేదీన లక్షణాలు బయటకు వచ్చాయని వివరించింది. ఇదీ చాలా మ్యూటేషన్స్ ఉంటాయి. ఇదీ కాస్త ఆందోళన కలిగించే అంశమే.

ఒమ్రికాన్ వేరియంట్

ఒమ్రికాన్ వేరియంట్


కొత్త వేరియంట్‌ను ఒమ్రికాన్ అని పిలుస్తున్నారు. 50 ఉత్పరివర్తనాలు, స్పైక్ ప్రొటీన్‌లో 30 కన్నా ఎక్కువ ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఈ స్పైక్ ప్రొటీన్ల ద్వారానే వైరస్ మన శరీరంలోకి చొచ్చుకుపోతుంది. అందుకే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు వీటిని లక్ష్యాలుగా చేసుకుని పనిచేస్తాయి. ఇంకొంచెం లోతుగా చూస్తే రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో 10 ఉత్పరివర్తనాలు కనిపించాయి. మన శరీరంలోని కణాలను ముందుగా తాకేది వైరస్‌లో ఉన్న ఈ రిసెప్టర్ బైండింగ్ డొమైనే. ప్రపంచాన్ని గడగడలాడించిన డెల్టా వేరియంట్‌లో రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో రెండే ఉత్పరివర్తనాలు కనిపించాయి. ఈ స్థాయిలో మ్యుటేషన్లు, వైరస్‌తో ఏ మాత్రం పోరాడలేని ఒక రోగి శరీరం నుంచి బయటపడి ఉండవచ్చు. అయితే, చాలా రకాల మ్యుటేషన్లు చెడ్డవి కాకపోవచ్చు. ఇవి ఎలా పనిచేస్తున్నాయన్నది గమనించడం ముఖ్యం.

శాస్త్రీయ అధ్యయనం

శాస్త్రీయ అధ్యయనం

ప్రయోగశాలలో శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టమైన సమాధానాలు ఇస్తాయి. కానీ, వాస్తవ ప్రపంచంలో వైరస్‌ను పర్యవేక్షించడం ద్వారా జవాబులు మరింత త్వరగా వస్తాయి. ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, ఆందోళనలకు కారణమయ్యే అంశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రావిన్స్‌లో 77 కేసులు, బోట్స్వానాలో నాలుగు కేసులు, హాంకాంగ్‌లో ఒకటి బయటపడ్డాయి. వీరందరికీ కొత్త వేరియంట్ కారణంగానే కోవిడ్ సోకినట్లు స్పష్టమైంది.

English summary
Prime Minister Narendra Modi chaired an important meeting on the Covid-19 situation and vaccination status in India on Saturday morning
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X