ఛాపర్ లో ప్రయానించాల్సిన మోడీ ప్లాన్ సడన్ గా ఎందుకు మారింది? అసలేం జరిగిందంటే
భద్రతా లోపం కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ తన పంజాబ్ లో నిర్వహించ తలపెట్టిన ర్యాలీని రద్దు చేసుకున్నారు. బుధవారం ఉదయం ఫిరోజ్ పూర్ లో అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడానికి పంజాబ్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికలు జరగాల్సి ఉన్న పంజాబ్ రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొనకుండానే వెనుదిరిగారు.
ముంబైలో కరోనా పంజా: సెకండ్ వేవ్ గరిష్ట కేసులను మించి; తాజాగా 15,166 కొత్తకేసులు

రైతుల ఆందోళన .. కాన్వాయ్ అడ్డగింతతో వెనుదిరిగిన పీఎం మోడీ
రోడ్డు మార్గంలో ప్రయాణం చేస్తున్న మోడీని అడ్డుకోవటం కోసం ఒక్కసారిగా రైతులు నిరసన తెలుపుతూ రోడ్డును దిగ్బంధించారు. దీంతో ఓ ఫ్లైఓవర్‌పై బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు దాదాపు అరగంట పాటు ఇరుక్కుపోయారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ ఫ్లైఓవర్ పై నే అరగంటపాటు చిక్కుకుపోయింది.ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్‌లోని బటిండా లో దిగి ర్యాలీ కోసం ఫిరోజ్ పూర్ కు వెళ్లాల్సి ఉంది. కానీ వాతావరణం కారణంగా ప్లాన్ మారింది.

వాతావరణం కారణంగా మారిన మోడీ ప్రయాణ ప్రణాళిక
మోడీ తన చాపర్ లో ప్రయాణం చేయాల్సి ఉండగా పొగమంచు కమ్మేయటంతో, వాతావరణం అనుకూలంగా లేదని రోడ్డు మార్గాన మోడీ ప్రయాణం చేయాలని నిర్ణయించారు. బటిండా నుండి ఫిరోజ్ పూర్ కు ప్రధాని మోడీ ప్రయాణ ప్రణాళికలో ఆకస్మాత్తుగా మార్పులు చోటుచేసుకోవడంతో ఆయన రోడ్డు మార్గంలో ప్రయాణించ వలసి వచ్చింది. ప్రధాని మోడీ 100 కిలోమీటర్ల దూరం కారులో ప్రయాణం చేశారు. దాదాపు 2 గంటల పాటు ప్రధాని మోడీ రోడ్డు మార్గంలో ప్రయాణం చేశారు.

ర్యాలీ వేదికకు 10 కిలోమీటర్ల దూరంలో నిలిచిపోయిన కాన్వాయ్
ర్యాలీ వేదిక కు పది కిలోమీటర్ల దూరంలో మోడీ కాన్వాయ్ ను రైతులు అడ్డుకున్నారు. నిరసనకారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో అరగంట సేపు నిలిచిపోయిన మోడీ కాన్వాయ్ ర్యాలీ రద్దు చేసుకుని వెనుతిరిగి వెళ్ళిపోయింది. ఫిరోజ్ పూర్ ఫ్లై ఓవర్ పై ప్రధాని మోడీ కాన్వాయ్ రోడ్డుపై వేచి ఉండడం, కాన్వాయ్ లోని ఇతర కార్లు మోడీ కారు చుట్టూ మోడీ కి రక్షణ వలయంగా నిలవడం ప్రధానంగా కనిపించాయి. మోడీ కాన్వాయ్ కి ముందు కొంతమంది రైతులు ఆందోళన నిర్వహిస్తూ కనిపించారు.

అరగంట పాటు అక్కడే ఉన్న మోడీ ... ఆపై పర్యటన రద్దు
దీంతో భద్రతా కారణాల దృష్ట్యా అరగంట వేచి చూసిన ప్రధాని నరేంద్ర మోడీ తన పర్యటనను రద్దు చేసుకొని వెనుదిరిగి వెళ్లిపోయారు. కాన్వాయ్ వెనుదిరిగి వెళ్తున్న క్రమంలో కొందరు నిరసనకారులు ప్రధాని మోడీ కాన్వాయ్ ను వెంబడించటం కనిపించింది. ఈ క్రమంలో మోడీ ప్రాణాలతో తిరిగి వెళుతున్నా మీ ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు అంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆ తర్వాత కేంద్రంలోని బిజెపి సర్కార్, పంజాబ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు టార్గెట్ చేస్తూ మోడీ హత్యకు కుట్ర చేస్తున్నారన్న ఆరోపణలు తెరమీదకు తీసుకు వచ్చింది.

బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య భారీ రాజకీయ ఘర్షణ
పంజాబ్ పోలీసుల భద్రతా వైఫల్యం మోడీ పర్యటన నేపథ్యంలో కొట్టొచ్చినట్టు కనిపించింది అని తీవ్రస్థాయిలో మండిపడింది. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. కానీ ప్లాన్ మార్పు వల్లే ఇబ్బంది తలెత్తింది అని, ఎలాంటి భద్రతాలోపం లేదని పంజాబ్ సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ పేర్కొన్నారు. ఇక మోడీ పర్యటనలో భద్రతా లోపం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య భారీ రాజకీయ ఘర్షణకు దారితీసింది.