వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో తెలుగు జర్నలిస్టు మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం

|
Google Oneindia TeluguNews

జర్నలిజంలో కంచిభొట్ల చేసిన సేవలు చిరస్మరణీయమని ప్రధాని మోడీ ప్రశంసించారు. కంచిభొట్ల బ్రహ్మానందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందినవారు. రాష్ట్రంలోనే ఓ ఆంగ్ల పత్రిక పాత్రికేయునిగా జీవితం ప్రారంభించిన ఆయన.. తర్వాత పలు పత్రికల్లో పనిచేశారు.

ఆంగ్ల వార్తా సంస్థ యూఎస్ఐలోనూ పనిచేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి కుటుంబంతో సహా న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. కాగా, ఆయన పదిరోజుల క్రితం కరోనా బారిపడ్డారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మరణించినట్లు న్యూయార్క్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

PM Modi condoles death of veteran Indian-American journalist who died of covid-19

కాగా, అమెరికాలో కరోనావైరస్ విజృంభిస్తోంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల్లో భారతీయుల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే అమెరికా మొత్తం కరోనాతో 12,800 మందికిపైగా మరణించారు. కేవలం న్యూయార్క్ రాష్ట్రంలోనే 5400 మంది ప్రాణాలు కోల్పోయారు.

న్యూజెర్సీలో 44,416 మందికి కరోనా సోకగా.. 1200 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఒక్కరోజే 1900 మరణాలు సంభవించడం గమనార్హం. మరోవైపు కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 3,99,667 మంది వైరస్ బారినపడ్డారు. వీరిలో 22,020 మంది కోలుకున్నారు.

Recommended Video

Lockdown : Watch Nagpur Residents Shower Flowers, Cheer Police Man During Route March

English summary
Prime Minister Narendra Modi on Wednesday condoled the demise of veteran Indian-American journalist Brahm Kanchibotla who died of coronavirus, saying he will be remembered for his fine work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X