వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భరతమాతను గౌరవించండి.. కాంగ్రెస్ పార్టీపై మోడీ విమర్శలు

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ ప్రజలు, వారి మనోభావాలు పట్టవని విమర్శించారు. జవాన్ల త్యాగాలను గుర్తించడం, గౌరవించడం అనే మాట ఉండదని దుయ్యబట్టారు. శుక్రవారం హర్యానాలో ప్రచారం నిర్వహించారు. గోహనలో ప్రచారం చేస్తూ.. కాంగ్రెస్ నేతలపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు. ఆ పార్టీకే రాజకీయాలే పరామావధి అని.. ప్రజల ప్రయోజనాలు పట్టవని విమర్శించారు.

జమ్ముకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి గురించి సభలో ప్రస్తావించారు. కశ్మీర్ విభజన గురించి ఎవరికీ తెలుసు అని అడిగారు. ఆగస్టు 5 నుంచి కశ్మీర్‌లో కూడా రాజ్యాంగం అమలవుతుందని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం విమర్శలకే ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రజల మంచి అంటే ఆ పార్టీకి గిట్టదని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ప్రజల అభిమతానికి ఆ పార్టీ విరుద్ధంగా ప్రవర్తిస్తుందని దుయ్యబట్టారు. ఇది సరికాదని వైఖరి మార్చుకోవాలని సూచించారు.

pm modi criticize congress party

ఓ రాజకీయ పార్టీగా ప్రజల మంచి గురించి కూడా ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీకి సూచించారు. కానీ ఆ పార్టీ మంచిని మరచిపోయిందని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనను విమర్శిస్తే ఓకే కానీ.. కానీ భరతమాతను గౌరవించాలని మోడీ సూచించారు. దీనిని ఎవరూ మరచిపోవద్దని సూచించారు. భరతమాతను గౌరవించకపోవడం సబబు కాదన్నారు. దీనిని ఎవరూ కూడా ఉపేక్షించబోరని తేల్చిచెప్పారు.

English summary
pm modi fire on congress party. they dont want public interests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X