PM Modi tour: ప్రధాని మోదీకి భద్రత కల్పించాల్సిన సైబర్ క్రైమ్ ఎస్ఐ ఆత్మహత్య, డ్యూటీకి రాలేనని చెప్పి !
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం బెంగళూరులో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఐటీ హబ్ కు వస్తున్న సందర్బంగా బెంగళూరులో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగళూరు సిటీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించే ప్రాంతాల్లో 2 వేల మందికిపైగా పోలీసులు బందోబస్తులో నిమగ్నం అయ్యారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించే ప్రాంతంలో విధులు నిర్వహించవలసిన ఎస్ఐ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రధాని నరేంద్ర మోదీ భద్రాతా ఏర్పాట్లలో నిమగ్నం కావలసిన పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకోవడంతో సాటి పోలీసులు హడలిపోయారు.

బెంగళూరుకు ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం బెంగళూరులో పర్యటిస్తున్న సందర్బంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న ప్రధాని నరేంద్ర మోదీ ముందుగా అనుకున్న ప్రకారం అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు.

బెంగళూరులో భారీ పోలీసు బందోబస్తు
ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరులో పర్యటిస్తున్న సందర్బంగా బెంగళూరు సిటీలో 2, 100 మంది పోలీసులు బందోబస్తులో నిమగ్నం అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించే ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా మళ్లించారు. బెంగళూరు యూనివర్శిటీ ఉద్యోగులు, విద్యార్థులు అందరికి సెలవులు ప్రకటించారు.

మోదీ పర్యటనకు డ్యూటీ వేసిన అధికారులు
బెంగళూరు నగరంలోని హనుమంతనగర పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్న సుదర్శన్ శెట్టి (51) కొన్ని నెలల క్రితం బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో డిప్యుటేషన్ పద్దతిలో విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్బంగా విధులకు హాజరుకావాలని పై అధికారులు ఎస్ఐ సుదర్శన్ శెట్టికి సూచించారు.

డ్యూటీకి రాలేనని చెప్పి ఆత్మహత్య
తనకు అనారోగ్యంగా ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్బంగా తాను విధులకు హాజరుకాలేనని ఎస్ఐ సుదర్శన్ శెట్టి అతని పై అధికారులకు సమాచారం ఇచ్చారు. యశవంతపురంలోని ఇంటిలో ఉన్న ఎస్ఐ సుదర్శన్ శెట్టి కొంతసేపు ఆయన కొడుకుతో కాలం గడిపారు. తరువాత బెడ్ రూమ్ లోకి వెళ్లిన ఎస్ఐ సుదర్శన్ శెట్టి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

అసలు ఏం జరిగింది ?
కొన్ని గంటల తరువాత విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు ఎస్ఐ సుదర్శన్ శెట్టి ఆత్మహత్య చేసుకున్న విషయం ఆయన పై పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించే ప్రాంతంలో విధులు నిర్వహించవలసిన ఎస్ఐ సుదర్శన్ శెట్టి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ భద్రాతా ఏర్పాట్లలో నిమగ్నం కావలసిన పోలీసు అధికారి సుదుర్శన్ శెట్టి ఆత్మహత్య చేసుకోవడంతో సాటి పోలీసులు హడలిపోయారు.