వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతర్జాతీయ యవనికపై మెరుగైన ప్రదర్శనకు ఆస్కారం, ఖేలో ఇండియా ప్రారంభోత్సవంలో మోడీ

|
Google Oneindia TeluguNews

ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. కటక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో అథ్లెట్లు ఉండగా.. ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆటలను ప్రారంభించారు. ఖేలో ఇండియా గేమ్స్‌లో భాగంగా 159 వర్సిటీలకు చెందిన 3400 మంది అథ్లెట్లు ఆటలు ఆడనున్నారు.

రగ్బీ సహా ఇతర ఆరు ఆటలు వర్సిటీ విద్యార్థుల మధ్య నిర్వహిస్తారు. ఖేలో ఇండియా వర్సిటీ గేమ్స్ ప్రారంభించడం చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. దీంతో దేశ ఆటల్లో విప్లవం వస్తోందని అభివర్ణించారు. దేశ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలయ్యేందుకే కటక్ నేతృత్వం వహించబోతోందని చెప్పారు. భారతీయ అథ్లెట్లకు ఇది మంచి ముందుడుగు అని, సరిగా ఉపయోగించుకొని అంతర్జాతీయ యవనికపై మెరుగైన ప్రదర్శన ఇచ్చి దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.

PM Modi declares open inaugural Khelo India University Games

ఐదేళ్లలో క్రీడారంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని మోడీ అభిప్రాయపడ్డారు. క్రీడాకారుల్లో ఉన్న టాలెంట్ వెలికితీసేందుకు ఖేలో ఇండియా ఉపయుక్తంగా ఉంటుందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఆయా క్రీడల్లో విద్యార్థుల ఎంపిక పారదర్శకంగా చేపడుతామని పేర్కొన్నారు. ఖేలో ఇండియా అంటే యువత టాలెంట్ వెలికితీయడమేనని చెప్పారు. ఖేలో ఇండియా ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిరెణ్ రిజిజు, ధర్మేంద్ర ప్రధాన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

English summary
Prime Minister Narendra Modi on Saturday launched the first ever Khelo India University Games at the Jawaharlal Nehru Indoor Stadium on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X