వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన్మోహన్ దేశభక్తిని మేం శంకించడం లేదు: రాజ్యసభలో జైట్లీ, శాంతించిన కాంగ్రెస్

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీల గురించి ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నడూ తక్కువ చేసి మాట్లాడలేదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం రాజ్యసభలో వివరణ ఇచ్చారు.

గుజరాత్ ఎన్నికల్లో పాక్ జోక్యం చేసుకుంటున్నదని, మాజీ ప్రధానితో పాటు ఇతర నేతలు కూడా ఆ కుట్రలో పాలుపంచుకుంటున్నారని ఇటీవల ప్రధాని మోడీ ఆరోపణలు చేయడంతో ఆ అంశాన్ని పార్లమెంట్‌లో కొన్ని రోజులుగా విపక్షాలు లేవనెత్తుతూనే ఉన్నాయి.

ప్రధాని తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని విపక్షాలు ఉభయసభలను స్తంభింపచేశాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై బుధవారం మధ్యాహ్నం రాజ్యసభలో అరుణ్ జైట్లీ స్పందించారు. ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని మన్మోహన్ నైతికతను ప్రధాని మోడీ ప్రశ్నించలేదని తెలిపారు.

'PM Modi didn't mean to question Manmohan Singh's commitment to India,' says BJP's Arun Jaitley in RS

మాజీ ప్రధాని మన్మోహన్, మాజీ ఉపరాష్ట్రపతి హమిద్ అన్సారీలను అత్యున్నతంగా గుర్తిస్తామన్నారు. వారిని అత్యున్నతంగా గౌరవిస్తామని, వారి దేశ‌భ‌క్తిని శంకించడంలేదని జైట్లీ స్పష్టం చేశారు.

ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై అరుణ్ జైట్లీ వివరణ ఇచ్చినందుకు ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్ కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్ ఎన్నికల సమయంలో తమ పార్టీ ఏదైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే, వాటిని వెనక్కి తీసుకుంటున్నామని, ఇక ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని భావిస్తున్నామని ఆజాద్ తెలిపారు.

English summary
The BJP didn't exactly apologise, but it said today that PM Narendra Modi didn't mean to question his predecessor Manmohan Singh's commitment to India when he accused him of colluding with Pakistan.The BJP also said it holds Singh and former vice president Hamid Ansari "in high esteem". "PM in his speeches didn't question, nor meant to question the commitment to this nation of either former PM Manmohan Singh or Former VP Hamid Ansari, any such perception is erroneous, we hold these leaders in high esteem, as well as their commitment to India," said senior BJP leader and Union minister Arun Jaitley today in the Rajya Sabha. The Congress has been disrupting the Rajya Sabha since the beginning of the Winter Session of Parliament and demanding that Modi apologize.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X