చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమిళనాడులో భారీ వర్షం, పంటలు నష్టం: సహాయం చేస్తాం, ధైర్యంగా ఉండండి, ప్రధాని మోడీ హామి !

తమిళనాడులో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నై నగరంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ నష్టం జరిగిందని, సహాయం చెయ్యాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి,

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నై నగరంతో పాటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ నష్టం జరిగిందని, సహాయం చెయ్యాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రధాని నరేంద్ర మోడీకి మనవి చేశారు.

Recommended Video

Narendra Modi in Chennai : PM Meets DMK Chief Karunanidhi

సోమవారం ఉదయం ప్రత్యేక విమానంలో చెన్నైలోని మీనంబాక్కం విమానాశ్రయం చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, బీజేపీ నాయకులు శాలువలతో ఆయన్ను సన్మానించారు.

PM Modi discusses Chennai rain damage with Tamil Nadu CM Palanisamy

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చెన్నై నగరంలోని అనేక ప్రాంతాలు దెబ్బ తిన్నాయని, తమిళనాడులోని అనేక జిల్లాల్లో రైతులు పంటలు నష్టపోయారని ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పారు. పూర్తి సమాచారం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ తప్పకుండా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పాటు బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ తో సహ ఆ పార్టీ సీనియర్ నేతలు అనేక మంది ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యి తమిళనాడులో వర్షాల కారణంగా జరిగిన నష్టం గురించి వివరించారు.

English summary
Prime minister Narendra Modi, who reached Chennai, on Monday, discussed with Tamil Nadu chief minister Edappadi K Palaniswami the damage caused by rains in the city and other parts of the state.Modi, who landed at the airport here, was received by Palaniswami, deputy chief minister O Panneerselvam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X