వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎల్‌వోసీలో మోడీ.. సైనికులతో దిపావళీ వేడుకలు

|
Google Oneindia TeluguNews

తమ కుటుంబాలకు దూరంగా అంత్యంత క్లిష్టమైన పరిస్థితులు, ఓక్కోసారి దుర్భర పరిస్థితుల్లో తమ జీవితాలను ఫణంగా పెట్టి దేశరక్షణ కోసం పాటుపడుతున్న సైనికుల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ ఈ సారి కూడ దీపావళీ వేడుకలను జరుపుకోనున్నారు. దీపావళీ వేడుకలను సైనికుల మధ్య జరుపుకోవడం ద్వార వారిలో ఆత్మస్థైర్యాన్ని ,ఉత్సహాన్ని నింపవచ్చనే ఉద్దేశ్యంతో మోడీ ప్రతి సంవత్సరం వారి మధ్య జరిగే వేడుకలకు హజరవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయన మొదటిసారిగా ప్రధానిగా అధికారం చేపట్టిన 2014 సంవత్సరం నుండి దీపావళీ వేడుకల్లో పాల్గోంటున్నారు. దీంతో ఈసారి కూడ ఢిల్లీకి అవతల ప్రధాని మోడీ దీపావళీ వేడుకల్లో పాల్గోంటున్నారని అధికారులు వెల్లడించారు.

pm Modi Diwali celebrations with soldiers

2014లో మొదటిసారిగా అత్యంత ఎతైన ,మంచుతో కూడుకున్న ప్రాంతం ,సియాచిన్ సెక్టార్‌లో సైనికులతో కలిసి ఆయన దీపావళీ వేడుకల్లో పాల్గోన్నారు. 2015 సంవత్సరంలో పంజాబ్‌ రాష్ట్ర సైనికులతో కలిసి దిపావళీ సెలబ్రెట్ చేసుకున్నారు. అనంతరం 2016లో హిమాచల్ ప్రదేశ్‌లోని ఐటీబీపీ సిబ్బందితో , 2017లో జమ్ము కశ్మీర్‌ సైనికులతో పాటు గత సంవత్సరం ఉత్తరాఖండ్‌ జరిగిన వేడుకల్లో పాల్గోన్నారు.

కాగా ఈసారి మాత్రం ఆర్టికల్ 370 రద్దు తర్వాత గత రెండు నెలలుగా భారత సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతవరణం నెలకొంటుంది. ప్రతి ఎక్కడో ఓ చోట ఓ వైపు పాకిస్తాన్ సైనికులు , మరోవైపు పాకిస్తన్ ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. దీంతో ఎల్‌వోసీ వెంట టెన్షన్ వాతవరణ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎల్‌వోసీ ప్రాంతలో ఉత్తర సెక్టార్‌లో దిపావళీ వేడుకలను నిర్వహించడం ద్వార సైనికుల్లో ఉత్సహాన్ని నింపనున్నారు.

English summary
Prime Minister Narendra Modi is expected to spend Diwali with soldiers at a forward base, most likely in the northern sector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X