• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విదేశీ పర్యటనల్లో మోడీ అక్కడ ఉండరట..మరెక్కడుంటారు..?

|

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధికార పర్యటనలపై విదేశాలకు వెళ్లిన సమయంలోహోటల్స్‌లో ఉండటాన్ని ఇష్టపడరట. ఈ విషయం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా లోక్‌సభకు వివరించారు. ప్రధాని మోడీ ఖర్చులపై వివరణ ఇస్తూ ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇంతకీ మోడీ విదేశీపర్యటలన సందర్భంగా హోటల్స్‌లో కాకుండా ఎక్కడుంటారు అనేగా మీ డౌటు... మరి ఇందుకు అమిత్ షా ఏ చెప్పారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

హోటల్స్‌లో ఉండేందుకు ఇష్టపడని మోడీ

హోటల్స్‌లో ఉండేందుకు ఇష్టపడని మోడీ

ప్రధాని మోడీ విదేశీ పర్యటనలకు వెళ్లిన సమయంలో ఆయన హోటల్స్‌లో బసచేయడాన్ని ఇష్టపడరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. బుధవారం జరిగిన సభలో అమిత్ షా ప్రధాని ఖర్చుల గురించి ఆయన కాస్ట్ కట్టింగ్ విధానాల గురించి సభకు వివరించారు. విదేశాలకు విమానంలో వెళ్లిన సమయంలో ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఒక చోట ఆగిపోవాల్సి వస్తే ఎంత సేపైనా సరే విమానాశ్రయంలోని లాంజ్‌కే పరిమితమవుతారు తప్ప హోటల్స్‌లో ఉండరని అమిత్ షా చెప్పారు. అక్కడే ఆయన ఫ్రెష్ అవుతారని వెల్లడించారు. స్నానం కూడా ఎయిర్‌పోర్టులోని వాష్‌రూమ్స్‌లోనే చేస్తారని వెల్లడించారు.

 సాధారణంగా ఫైవ్ స్టార్ హోటల్స్‌లో ప్రధానులు

సాధారణంగా ఫైవ్ స్టార్ హోటల్స్‌లో ప్రధానులు

ఇందనం నింపుకునేందుకు విమానం ఏదైనా ఎయిర్‌పోర్టులో దిగితే కొందరు ప్రధాన మంత్రులు వారి సెక్యూరిటీ మొత్తం దగ్గరలోని ఫైవ్ స్టార్ హోటల్స్‌లో బసచేసేవారని సభకు తెలిపారు అమిత్ షా. మోడీ మాత్రం అలా చేయరని ఎందుకంటే దానికి మళ్లీ అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందనే ఉద్దేశం తనదని అమిత్ షా వెల్లడించారు. అది ప్రభుత్వ ఖజానాకు అదనపు భారం అవుతుందని ప్రధాని మోడీ ఆలోచిస్తారని వెల్లడించారు.

20శాతం కంటే తక్కువ మంది సిబ్బంది

20శాతం కంటే తక్కువ మంది సిబ్బంది

ప్రధాని మోడీ వ్యక్తిగత జీవితం ఎంతో క్రమశిక్షణతో కూడినదని చెప్పారు అమిత్ షా. ప్రధాని విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అతనితో పాటు 20శాతం కంటే తక్కవగా సిబ్బందిని తీసుకెళతారని చెప్పారు. ఇక అధికారుల కోసం పెద్ద సంఖ్యలో కార్ల వినియోగంను కూడా మోడీ ప్రోత్సహించరని చెప్పారు. అంతకుముందు ప్రధానుల దగ్గర పనిచేసిన అధికారులు ఒక్కొక్కరు ఒక్కో కారును వినియోగించేవారని చెప్పారు. ఇప్పుడు ఓ బస్సు లేదా పెద్ద వాహనం ఒక్కదాన్నే వాడతారని సభకు గుర్తు చేశారు అమిత్ షా.

సెక్యూరిటీని కొందరు స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు

సెక్యూరిటీని కొందరు స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు

ఇక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. గాంధీ కుటుంబం ఎస్పీజీ చట్టాన్ని ఉల్లంఘించిందని అందులో పొందుపర్చిన అంశాలను గాలికొదిలేసిందని అమిత్ షా ధ్వజమెత్తారు. 20 ఏళ్ల వరకు మోడీకి రాష్ట్ర సెక్యూరిటీ ఉండగా, ఎప్పుడూ నిబంధనలను ఉల్లంఘించలేదని చెప్పారు. కొందరికి సెక్యూరిటీ అనేది స్టేటస్ సింబల్‌గా మారిందని అమిత్ షా ధ్వజమెత్తారు. సెక్యూరిటీ నిబంధనలను ప్రొటోకాల్స్‌ను ఫాలో అవడం మోడీని చూసి నేర్చుకోవాలని అమిత్ షా చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Boasting in Lok Sabha about Narendra Modi’s cost cutting policy and priority, Home Minister Amit Shah on Wednesday said during technical halts in the course of foreign visits, he opts to rest and take a bath at airport terminals instead of staying in luxury five star hotels overnight.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more