వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెలిచిన నిమిషాల్లోనే మారిన వైఖరి ? : పేరుకు ముందు చౌకీదార్ తీసేసిన మోడీ .. ఎందుకంటే ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయో లేదో అప్పుడే ప్రధాని మోడీ వైఖరి మారిందా ? ఎన్నికల ముందు 'చౌకీదార్' (నేను కాపాలాదారుడిని) అంటూ ప్రచారం చేసుకున్నారు. తన ట్వీట్టర్ అకౌంట్ ముందు కూడా చౌకీదార్ అని పెట్టుకున్నారు. ఆయనతోపాటు కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు, ఇతర ముఖ్యనేతలు కూడా హ్యాష్ ట్యాగ్ పెట్టుకున్నారు. కానీ రెండోసారి విజయం సాధించిన నిమిషాల్లోనే పేరు ముందు మై బీ చౌకీదార్ అనే పదాన్ని తీసేశారు. ఇందుకు వివరణ కూడా ఇచ్చారు.

ఎందుకు తీశానంటే ..
ట్వీట్టర్‌లో 'చౌకీదార్' అనే పదం ఎందుకు తీశానో మోదీ వివరించారు. ఇక నుంచి కాపాలాదారుడు అంతర్గతంగా పోరాడుతారని స్పష్టంచేశారు. అంతేకాదు చౌకీదార్ స్ఫూర్తిని మరో స్థానానికి తీసుకెళ్తానని భరోసానిచ్చారు మోడీ. ఇక నుంచి ప్రతి క్షణం దేశ హితం కోసం పాటుపడతానని పేర్కొన్నారు. తాను తన ట్వీట్టర్ ఖాతా నుంచి మై బీ చౌకీదార్ అనే పదం తీసేశానని .. మీరు కూడా తీసివేయాలని బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు.

PM Modi Drops Chowkidar Prefix From Twitter Profile With A Message

మై చౌకీదార్ ...
సార్వత్రిక ఎన్నికల ముందు మై బీ చౌకీదార్ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లారు మోదీ. ప్రతీ ప్రచారం .. సభ, సమావేశాల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. నేను కాపాలాదారుని అని మోడీ ప్రచారం చేస్తుండగా .. చౌకీదార్ చోర్ హై అని రాహుల్ అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కాపాలాదారుడే దొంగలకు దోచిపెట్టారని ఆరోపించారు. కానీ నెటిజన్లు మోదీకి ఇచ్చిన ప్రయారిటీ .. రాహుల్‌‌కు ఇవ్వలేదు. ఎన్నికల్లో ఓటర్లు కూడా మళ్లీ తిరిగి మోదీకి పట్టం కట్టారు. రాహుల్ వాదనలను ఏకీభవించని పరిస్థితి నెలకొంది.

English summary
prime Minister Narendra Modi, who has won a huge mandate for a second term in power, dropped the prefix "chowkidar" from his Twitter profile today, saying it would remain an "integral part" of him."Now, the time has come to take the Chowkidar Spirit to the next level.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X