వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోదీ అరుదైన రికార్డు - పాలకుడిగా 20 ఏళ్ల ప్రస్థానం - తొలిసారి హైడ్రామా - ఆపై జనామోదంతో

|
Google Oneindia TeluguNews

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల ఓట్లతో గెలిచి, సుదీర్ఘకాలం పరిపాలకులుగా వ్యవహరించిన అరుదైన రికార్డును భారత ప్రధాని నరేంద్ర మోదీ సొంతం చేసుకున్నారు. వరుసగా 20 ఏళ్లపాటు ప్రభుత్వ సారధిగా అధికారంలో ఉన్న ప్రపంచ నేతల సరసన ఆయన నిలిచారు. 2001లో సరిగ్గా ఇదే రోజున(అక్టోబర్ 7న) గుజరాత్‌ ముఖ్యమంత్రిగా సారధ్య ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన పాలకుడిగా నేటితో 20వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.

రేపిస్టు రఘునందన్ రావుకు టికెటా? దుబ్బాక బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు - పార్టీ నుంచి ఫైర్రేపిస్టు రఘునందన్ రావుకు టికెటా? దుబ్బాక బీజేపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు - పార్టీ నుంచి ఫైర్

ఎమ్మెల్యేగా అనుభవం లేకున్నా..

ఎమ్మెల్యేగా అనుభవం లేకున్నా..


పలు నాటకీయ పరిణామాల మధ్య 2001, అక్టోబర్ 7న నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా తన పాలనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంతకు ముందు కనీసం ఎమ్మెల్యేగా కూడా పోటీచేయని మోదీ.. పార్టీ నిర్మాణంలో తనకున్న అనుభవంతోనే సీఎంగా ఎంపికయ్యారు. 2001 కచ్ భూకంపం సహాయక చర్యల్లో అవినీతి ఆరోపణలు, ఉప ఎన్నికల్లో ఓటమి, వృద్ధాప్యం తదితర కారణాల నేపథ్యంలో ఎన్నికలు మరో ఏడాది ఉండగానే కేశుభాయ్ పటేల్ ను దించేసి, మోదీని గుజరాత్ సీఎంగా ప్రకటించింది బీజేపీ అధిష్టానం. సీఎం అయిన తర్వాతగానీ, 2002లో ఉపఎన్నికలో తొలిసారి ఆయన జనం ఓట్లతో గెలిచారు. ఆ తర్వాత జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికల్లోనూ మోదీ సారధ్యంలోని బీజేపీ విజయఢంకా మోగించింది. గ్యాప్ లేకుండా 12ఏళ్ల, 227 రోజులపాటు గుజరాత్ సీఎంగా పనిచేశారు..

విశాఖలో దారుణం: బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారయత్నం - అరెస్ట్ - జగన్ సర్కారుపై లోకేశ్ ఫైర్విశాఖలో దారుణం: బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారయత్నం - అరెస్ట్ - జగన్ సర్కారుపై లోకేశ్ ఫైర్

సీఎం, పీఎంగా 20 ఏళ్లు..

సీఎం, పీఎంగా 20 ఏళ్లు..

గుజరాత్ సీఎంగా దాదాపు 13 ఏళ్లు పదవిలో కొనసాగిన నరేంద్ర మోదీ.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం అనంతరం ప్రధానమంత్రి పదవి చేపట్టిన ఆయన, గతేడాది ఎన్నికల్లోనూ బంపర్ మెజార్టీతో ప్రధానిగా ఎన్నికై, ఏడేళ్లుగా ఆ హోదాలో కొనసాగుతున్నారు. దీంతో వరుసగా 20 ఏళ్ల పాటు ప్రభుత్వ సారధిగా, ఓటమి ఎరుగని నాయకుడిగా ఆయన కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు ‘నమో 20వ ఏడాది' హ్యాష్‌ట్యాగ్‌ పేరిట సోషల్ మీడియాలో సంబురాలు చేసుకుంటున్నారు.

ప్రపంచ రికార్డు కూడా..

ప్రపంచ రికార్డు కూడా..

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలకు సారధిగా వ్యవహరిస్తూ గ్యాప్ లేకుండా 20 ఏళ్లపాటు పాలకుడిగా ఉన్న నరేంద్ర మోదీది ప్రపంచ రికార్డు కూడా. మన దేశానికి సంబంధించి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 17ఏళ్లు(కచ్చితంగా 16 ఏళ్ల, 286 రోజులు) ఏకబిగిన పదవిలో కొనసాగారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మధ్యలో గవర్నర్ గా గ్యాప్ తీసుకుంటూ 20 ఏళ్ల పాటు పాలకుడిగా పనిచేశారు. మరో అమెరికా ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ రూజ్ వెల్ట్ ఏకబిగిన 16 ఏళ్ల 3 నెలలు పాలకుడిగా వ్యవహరించారు. హెల్మంట్ కోహ్ల్ 16 ఏళ్లు గ్యాప్ లేకుండా జెర్మనీ చాన్సలర్ గా వ్యవహరించారు. జార్జ్ బుష్ గవర్నర్, ప్రెసిడెంట్ గా 14 ఏళ్లు పాలించారు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ గా ఫ్రాంకోయిస్ నిర్విరామంగా 13ఏళ్ల 11 నెలలు పదవిలో కొనసాగారాు. బ్రిటన్ ప్రధానిగా మార్గరేట్ థాచర్ 11 నెలల, 6 మాసాలపాటు గ్యాప్ లేకుండా కొనసాగారు.

Recommended Video

Top News Of The Day : Kim సంచలన ప్రకటన.. China కు ఉత్తర కొరియా మద్దతు!
భారతీయులకు గర్వకారణం..

భారతీయులకు గర్వకారణం..


ప్రభుత్వ సారధిగా నరేంద్ర మోదీ 20 ఏళ్లు పూర్తి చేసుకోవడం భారతీయులందరికీ గర్వకారణమన్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.. ప్రపంచంతోపాటు భారత్‌లో శాంతి, స్థిరత్వం కోసం మరింత కాలం అధికారంలో కొనసాగే శక్తి మోదీకి లభించాలని ఆకాంక్షించారు. అక్టోబర్ 7వ తేదీ దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజుగా మోదీ సుదీర్ఘకాల సహచరుడు, ప్రస్తుత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మోదీ సారథ్యం దేశానికి కొత్త దశను, దిశను ఇస్తోందని షా అన్నారు.

English summary
The journey of Narendra Modi, as the head of an elected government started in 2001 under the trying circumstances of relief work for the Bhuj earthquake. Since then, Narendra Modi, currently the Prime Minister of India has not looked back, as he continues to tread the path of development for all. Union Home Minister Amit Shah on Wednesday congratulated Prime Minister Narendra Modi as the latter entered 20th consecutive year as the democratically elected head of a government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X