వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నమామీ గంగ-బోటులో షికారు: మెట్లెక్కుతూ తూలిపడ్డ ప్రధాని నరేంద్ర మోడీ(వీడియో)

|
Google Oneindia TeluguNews

లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం నమామీ గంగ ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జాతీయ గంగా మండలి తొలి సమావేశంలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ వచ్చారు. శనివారం ఉదయం కాన్పూర్ చేరుకున్న మోడీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాత్ సాదర స్వాగతం పలికారు.

బోటులో షికారు..


ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తోపాటు ఎన్డీఏ ముఖ్యమత్రులతో గంగా నదిలో కాసేపు బోటు షికారు చేశారు. ఈ బోటు షికారులో యూపీ సీఎం యోగి ఆదత్యనాథ్ తోపాటు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ మోడీ ప్రధాని వెంట ఉన్నారు. అటల్ ఘాట్ వద్ద బోటులో వీరంతా ప్రయాణం చేశారు.

స్వచ్ఛ గంగా..

స్వచ్ఛ గంగా..


చంద్రశేఖర్ ఆజాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మోడీ అధ్యక్షతన జాతీయ గంగా మండలి సమావేశం జరిగింది. గంగా నది పరిరక్షణ కోసం చేపట్టాల్సిన చర్యలకు ప్రధాని మోడీ అధికారులతో చర్చించారు. స్వచ్ఛ గంగ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్‌కు ప్రధాని మోడీ నివాళులర్పించారు.

తూలిపడ్డ ప్రధాని మోడీ

ఇది ఇలావుంటే, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. అటల్ ఘాట్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ మెట్లు ఎక్కుతూ ఒక్కసారిగా తూలి కిందపడిపోయారు. వెంటనే అప్రమత్తమైన ఎస్పీజీ సిబ్బంది.. ఆయనను పైకి లేపారు. ప్రధానికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

English summary
pm Narendra Modi fell down at Atal ghat in Kanpur and spg helps him get up
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X