వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ వీడ్కోలు సభలో ప్రధాని మోడీ భావోద్వేగం:నిజమైన మిత్రుడు అంటూ కితాబు

|
Google Oneindia TeluguNews

భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ వీడ్కోలు సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ నుంచి రిటైర్ కానున్న నేపథ్యంలో ఆయన సేవలను పలువురు కొనియాడారు . ఫిబ్రవరి 15 న పదవీకాలం ముగియడంతో పదవీ విరమణ చేస్తున్న ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ గులాం నబీ ఆజాద్‌కు రాజ్యసభ మంగళవారం వీడ్కోలు పలికింది.

Recommended Video

#modi #gulamnabiazad రాజ్యసభలో ప్రధాని మోడీ భావోద్వేగం
రాజ్యసభలో కాంగ్రెస్ ప్రముఖుడికి వీడ్కోలు పలికిన మోడీ

రాజ్యసభలో కాంగ్రెస్ ప్రముఖుడికి వీడ్కోలు పలికిన మోడీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంటులో ఉద్వేగానికి లోనయ్యారు. రాజ్యసభలో కాంగ్రెస్ ప్రముఖుడికి వీడ్కోలు పలికారు. గులాం నబీ ఆజాద్ చేసిన సేవలను గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ దేశానికి ఆయన ఎనలేని సేవ చేశారు అంటూ కితాబిచ్చారు. ఆయన సేవలు చిరస్మరణీయం అన్నారు. గులాం నబీ ఆజాద్ పార్లమెంటులో ఒక గుర్తింపు పొందిన పార్లమెంటేరియన్ గా ఉన్నారన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆజాద్ ఒకేలా ఉన్నారని, ఆజాద్ అందరు ఎంపీలకు ఆదర్శమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

ఆజాద్ ను తాను నిజమైన స్నేహితుడిగా.. ఆయన చేసిన సేవలను గుర్తు చేసి ఆజాద్ కు సెల్యూట్

ఆజాద్ ను తాను నిజమైన స్నేహితుడిగా.. ఆయన చేసిన సేవలను గుర్తు చేసి ఆజాద్ కు సెల్యూట్

ఆజాద్ ను తాను నిజమైన స్నేహితుడిగా భావిస్తున్నట్లుగా పేర్కొన్న ప్రధాని , గులాంనబీ ఆజాద్ కు సెల్యూట్ చేశారు . మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు . ఉగ్రవాదుల దాడికి కారణంగా గుజరాత్ నుండి వచ్చిన ప్రజలు కాశ్మీర్ లో చిక్కుకున్న సమయంలో ఆజాద్ తో పాటుగా, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎంతగానో సేవలందించారని గుర్తు చేసుకున్నారు. గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తన పార్టీ గురించి ఆలోచించటమే కాకుండా, పార్లమెంటు సభ్యుడిగా సభ సజావుగా జరగడానికి సహకరించారన్నారు .

ఆజాద్ ను పదవీ విరమణ చేయనివ్వనని మోడీ భావోద్వేగం

భారతదేశం అభివృద్ధి పట్ల కూడా ఆయన అభిరుచిని కలిగి ఉన్నారు అని ప్రధాని మోడీ ఈ రోజు రాజ్యసభలో పేర్కొన్నారు. పదవులు వస్తాయి ..పోతాయి. పవర్ వస్తుంది, పోతుంది.. అయితే వచ్చిన పదవులను, పవర్ ను ఎలా నిర్వహించాలో గులాం నబీ ఆజాద్ జీ నుండి తప్పక నేర్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు . ఇదే సమయంలో తాను ఆజాద్ ను పదవీ విరమణ చేయనివ్వను, ఆయన సలహా తీసుకోవడం కొనసాగిస్తాను. నా తలుపులు మీ కోసం ఎప్పుడూ తెరిచి ఉంటాయి అని ప్రధాని రాజ్యసభలో గులాం నబీ ఆజాద్ కు వీడ్కోలు పలికారు.

ఆజాద్ తనకు చాలా ఏళ్లుగా తెలుసని చెప్పిన ప్రధాని

ఆజాద్ తనకు చాలా ఏళ్లుగా తెలుసని చెప్పిన ప్రధాని

ఆజాద్ తనకు చాలా ఏళ్లుగా తెలుసని చెప్పిన ప్రధాని, రాజకీయాల్లో ఇద్దరూ చాలా కాలంగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. తామిద్దరూ చాలాకాలం పాటు ముఖ్యమంత్రిగా పని చేశామని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోడీ, తాను సీఎం కావడానికి ముందు గులాం నబీ ఆజాద్ తో మాట్లాడినట్లుగా స్పష్టం చేశారు.

English summary
Prime Minister Narendra Modi became emotional in the Parliament while bidding farewell to the Congress veteran Ghulam Nabi Azad in the Rajya Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X