హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంజనీర్స్ డే: మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ప్రధాని మోడీ, గూగుల్ ఘననివాళి

|
Google Oneindia TeluguNews

దేశంలో దేశ అభివృద్ధికి తోడ్పడుతున్న ప్రతి ఇంజనీర్‌కు అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇంజనీరింగ్ పితామహుడు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఈ రోజు దేశం ఇంజనీర్స్ డే‌ను జరపుకుంటోంది. ఈ క్రమంలోనే ప్రధాని ట్విటర్ ద్వారా దేశంలోని ప్రతి ఇంజనీర్‌కు ఇంజనీర్స్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ప్రతి ఒక్క ఇంజనీర్ దేశాభివృద్ధి కోసం పనిచేస్తున్నారని కొనియాడిన మోడీ...వారి అంకితభావంతో పనిచేసే విధానం భేష్ అని అన్నారు. దేశ నిర్మాణంలో వారి పాత్ర ప్రముఖంగా కనిపిస్తుందన్నారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఆయనకు ఘననివాళులు అర్పించారు.

ఇదిలా ఉంటే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కూడా సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 158వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించింది. విశ్వేశ్వరయ్య పనిని పరమార్థంగా భావించేవారని కొనియాడింది గూగుల్. ఇంజనీరింగ్ కోసం తన జీవితాన్ని మోక్షగుండం విశ్వేశ్వరయ్య అంకితం చేశారని తెలిపింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం మోక్షగుండం విశేష కృషి చేశారని పేర్కొంది. ప్రపంచ స్థాయిలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గుర్తింపు పొందారని కీర్తించిన గూగుల్, ప్రతి ఏటా ఆయన జన్మదినంను ఇంజనీర్స్ డేగా జరపుకుంటారని తన బ్లాగ్‌లో రాసుకుంది.

PM Modi and Google commemorate Engineers Day, pays tribute to Mokshagundam Visvesvaraya

మోక్షగుండం విశ్వేశ్వరయ్యను కీర్తిస్తూ కర్నాటకలో కావేరీ నదిపై ఆయన నిర్మించిన కృష్ణ రాజ సాగర్ డ్యామ్ ఫోటోను బ్యాంక్‌గ్రౌండ్‌లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఫోటోను డూడుల్‌ ప్రదర్శించింది. దీనిని వివరించింది డూడుల్. భారత్‌కు తిరిగి వచ్చిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రపంచమే అబ్బురుపోయేలా కృష్ణరాజ సాగర్ డ్యామ్ నిర్మించారని పేర్కొంది. 1924లో కృష్ణసాగర సరస్సును చూసి దానిపై రిజర్వాయర్ నిర్మించేందుకు డిజైన్ రూపొందించారు. ఇది అప్పట్లో భారతదేశంలో అతిపెద్ద డ్యామ్‌. ఈ డ్యామ్ చాలా నగరాలకు తాగునీరును అందించిందని డూడుల్ బ్లాగ్‌లో రాసుకుంది. హైదరాబాద్ వరదముంపునకు గురికాకుండా చక్కటి డ్రైనేజీ వ్యవస్థకు ప్రాణం పోశారు. విశాఖపట్నం కోసం పలు వ్యవసాయ ప్రణాళికలు రచించారు.ఎంత ఎదిగినప్పటికీ కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒదిగే ఉన్నారని డూడుల్ కితాబిచ్చింది.

English summary
On the occasion of 'Engineer's Day', Prime Minister Narendra Modi on Saturday commended the hardworking engineers of the nation.The Prime Minister took to Twitter to honour engineering genius M. Visvesvaraya, whose birth anniversary is celebrated as 'Engineer's Day'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X